ANIMAL: అదే బ్రష్‌.. అవే కిస్‌లు.. నువ్వేం మారలేదబ్బా సందీప్‌..

అర్జున్‌రెడ్డి టైమ్‌లో లిప్‌ కిస్ ప్రాక్టీస్‌ మీదే టీజర్ వదిలి సెన్సేషన్ అనిపించుకున్న సందీప్‌.. సినిమాలో ఎన్ని కిస్‌లు.. సారీ కిస్‌ సీన్లు పెట్టాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అతని డైరెక్షన్‌లో రణ్‌బీర్ కపూర్ హీరోగా యానిమల్ సినిమా రాబోతోంది.

  • Written By:
  • Publish Date - October 11, 2023 / 04:52 PM IST

ANIMAL: ఒక్కో డైరెక్టర్‌కు ఒక్కో స్టైల్ ఉంటుంది. త్రివిక్రమ్ అంటే పంచ్‌లని, శ్రీనువైట్ల అంటే పార్టీ సీన్ అని.. తమ సినిమాల్లో పక్కాగా ఇలాంటి సీన్లు ప్లాన్‌ చేసుకునే డైరెక్టర్ల లిస్ట్ పెద్దగానే ఉంది. ఈ జనరేషన్‌లో అర్జున్‌రెడ్డి డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగాది కూడా అదే స్టైల్‌. లిప్‌ కిస్‌ లేకుండా సినిమా ఉండదు అనిపిస్తుంది అతని సినిమాలు చూస్తుంటే ! అర్జున్‌రెడ్డి టైమ్‌లో లిప్‌ కిస్ ప్రాక్టీస్‌ మీదే టీజర్ వదిలి సెన్సేషన్ అనిపించుకున్న సందీప్‌.. సినిమాలో ఎన్ని కిస్‌లు.. సారీ కిస్‌ సీన్లు పెట్టాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఇప్పుడు అతని డైరెక్షన్‌లో రణ్‌బీర్ కపూర్ హీరోగా యానిమల్ సినిమా రాబోతోంది. ఇప్పటికే టీజర్ రిలీజ్ అయింది కూడా ! టీజర్‌లో తండ్రి కొడుకుల మధ్య స్ట్రగుల్, లవ్‌ సీన్లు తప్ప.. ఒక్కటంటే ఒక్క లిప్ కిస్‌ సీన్ కూడా కనిపించలేదు. అబ్బో.. సందీప్‌ మారిపోయాడే అనుకున్నారు అంతా ! వయొలెన్స్ అంటే ఎలా ఉంటుందో చూపిస్తానని ముందు నుంచి చెప్తున్న సందీప్‌.. దాన్ని చూపించేందుకు తన స్టైల్‌ పక్కనపెట్టాడా.. అసలు ఈ మూవీ తీసింది సందీప్‌ రెడ్డియేనా అని డౌట్లో పడిపోయారు అంతా ! కట్‌ చేస్తే.. యానిమల్ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయింది. రెండున్నర నిమిషాల సాంగ్‌లో తన మార్క్‌ లిప్‌లాక్‌ సీన్లు చూపించాడు. 26వ సెకన్ దగ్గర ఒకటి.. 62వ సెకన్ దగ్గర మరొకటి.. 109వ సెకన్ దగ్గర ఇంకోటి.. నిజానికి అక్కడ స్పేస్‌ లేదు. కానీ, క్రియేట్‌ చేసుకొని మరీ పెదవులు తడిపించాడు సందీప్‌. ఇంకా హైలైట్ ఏంటంటే.. అర్జున్‌రెడ్డిలో కనిపించిన బ్రష్‌ సీన్‌లాంటిది. ఈ సాంగ్‌లో కూడా కనిపిస్తుంది.

నిజానికి యానిమల్ మూవీ మీద పెద్దగా అంచనాలు కనిపించలేదు మొదట్లో. టీజర్‌ అమాంతం హైప్ తీసుకువచ్చింది. ఇప్పుడు సాంగ్ ఆ హైప్‌ను డబుల్ చేయడం ఖాయం అనిపిస్తోంది. యానిమల్ మూవీలో రష్మిక లవర్‌లా కనిపించినా.. కథ అంతా ఫ్యామిలీ చుట్టే తిరుగుతుంది. ఏమైనా అమ్మాయి అంటూ వచ్చిన ఫస్ట్ సింగిల్‌.. లిప్‌కిస్‌ల చప్పుళ్లతో అర్జున్‌రెడ్డిని గుర్తు చేసిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ మూవీలో రణ్‌బీర్‌ కపూర్‌, రష్మికతో పాటు అనిల్‌ కపూర్‌ లీడ్ రోల్‌లో యాక్ట్‌ చేస్తున్నాడు. డిసెంబర్‌ 1న మూవీ రిలీజ్‌ కాబోతోంది.