Animal Trailer: ఊచకోత.. యానిమల్ విధ్వంసం.. వేరే లెవల్ అంతే..!

ట్రైలర్‌తోనే అస‌లైన వైలెన్స్ ఎలా ఉంటుందో చూపించి సినిమాపై హైప్ పెంచేశాడు. ట్రైలర్‌లో‌నే ఇంత బ్లడ్ బాత్ ఉంటే.. సినిమాలో రణ్‌బీర్ ఊచకోత నెక్ట్స్ లెవల్‌లో ఉంటుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. యాక్షన్ సీక్వెన్స్‌లు, డైలాగ్స్, రణ్‌బీర్ మేకోవర్‌లో వేరియేషన్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయి.

  • Written By:
  • Publish Date - November 23, 2023 / 04:44 PM IST

Animal Trailer: బాలీవుడ్ రాకింగ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ నటిస్తున్న మోస్ట్ అవెయిటెడ్ మూవీ యానిమల్. టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ వంగా డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీపై ఓ రేంజ్‌లో అంచనాలు ఉన్నాయి. చాలా కాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్న రణ్‌బీర్ ఈ మూవీపై చాలా ఆశలే పెట్టుకున్నాడు. పైగా టీజర్, పోస్టర్లకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్‌గా రిలీజైన పవర్ ప్యాక్​డ్ సాలిడ్ ట్రైలర్ దుమ్మురేపడంతో పాటు గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. రా అండ్ ర‌స్టిక్ యాక్షన్‌తో వచ్చిన ట్రైలర్ వైరల్ అవుతూ.. టాప్‌లో ట్రెండింగ్ అవుతోంది.

Bigg Boss : జైలుకి వెళ్లిన వెళ్లిన శివాజీ.. బంపర్ ఛాన్స్ మిస్

అర్జున్ రెడ్డి త‌ర్వాత సందీప్ రెడ్డి వంగా ద‌ర్శక‌త్వంలో సినిమా వస్తుండటంతో యానిమల్ మూవీపై అంచ‌నాలు పెరిగాయి. దీంతో ర‌ణ్‌బీర్‌ను ఎలా చూపిస్తాడని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ట్రైలర్‌తోనే అస‌లైన వైలెన్స్ ఎలా ఉంటుందో చూపించి సినిమాపై హైప్ పెంచేశాడు. ట్రైలర్‌లో‌నే ఇంత బ్లడ్ బాత్ ఉంటే.. సినిమాలో రణ్‌బీర్ ఊచకోత నెక్ట్స్ లెవల్‌లో ఉంటుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. యాక్షన్ సీక్వెన్స్‌లు, డైలాగ్స్, రణ్‌బీర్ మేకోవర్‌లో వేరియేషన్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయి. ఇక ట్రైలర్ మొత్తం ఎమోషన్, యాక్షన్‌తో నింపేశాడు. ఆద్యంతం వైలెంట్ మోడ్​లో ఉన్న ట్రైలర్ అటు రణ్​బీర్ ఫ్యాన్స్​తో పాటు ఇటు మూవీ లవర్స్​ను తెగ ఆకట్టుకుంటోంది. తండ్రీకొడుకుల బంధాన్ని చూపిస్తూ సందీప్ రెడ్డి వంగ మరోసారి సెన్సేషన్‌గా మారబోతున్నారు. మూడు నిమినిషాల ముప్పై సెకన్స్ నిడివి ఉన్న ట్రైలర్ సందీప్ రెడ్డి మార్క్ టేకింగ్‌తో అగ్రెసివ్‌గా, యాక్షన్ థీమ్‌తో నిండిపోయింది.

దాదాపు 3 గంటల 21 నిమిషాల రన్ టైంతో రాబోతున్న ఈ మూవీ డిసెంబర్ 1న పాన్ ఇండియా లెవెల్‌లో విడుదల కాబోతోంది. వయోలెంట్ కంటెంట్ కారణంగా సినిమాకు ఎ సర్టిఫికెట్ ఇచ్చింది సీబీఎఫ్‌సీ. నిజానికి సందీప్ రెడ్డి తొలి సినిమా అర్జున్ రెడ్డి కూడా మూడు గంటలకుపైగానే ఉంది. హిందీలో జోధా అక్బర్ 3 గంటల 34 నిమిషాల నిడివితోరాగా.. ఆ తర్వాత ఎక్కువ నిడివి ఉన్న సినిమాగా యానిమల్ నిలిచింది. ఈ మూవీలో అంతలా ఏం చూపించబోతున్నారన్న ఆసక్తి నెలకొంది. ట్రైలర్ చూశాక బాలీవుడ్‌లో ఇప్పటివరకు ఉన్న రికార్డ్స్ అన్నీ బ్రేక్ అవడం ఖాయంగా కనిపిస్తోంది. మరి బాక్సాపీస్ దగ్గర యానిమల్ మూవీ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.