Animal: సోషల్ మీడియాలో యానిమల్ ఫీవర్ నడుస్తోందిప్పుడు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా టేకింగ్ ఎలా ఉంటుందో ఇప్పటికే అర్జున్ రెడ్డితో చూపించినా.. యానిమల్‌తో మరోసారి వహ్ అనిపించాడు. లెటెస్ట్‌గా రిలీజైన ట్రైలర్ చూస్తుంటే థియేటర్లలో బీభత్సమే అని అర్థమైపోతోంది. ఇక ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో రణబీర్ కపూర్.. తన భార్య అలియా భట్‌ను ఉద్దేశించి చేసిన ఫన్నీ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
డిసెంబర్ 1న విడుదల కానున్న ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా ‘యానిమల్’ ట్రైలర్‌ను లాంచ్ చేయడం కోసం ఓ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు.
PAWAN KALYAN: తెలంగాణ సమగ్ర అభివృద్దే లక్ష్యం.. జనసేన, బీజేపీ సమన్వయంతో పని చేయాలి: పవన్ కళ్యాణ్
ఆ ఈవెంట్‌లో సినిమా గురించి, అందులో తన క్యారెక్టర్ గురించి మాట్లాడిన రణబీర్ కపూర్ తన పర్సనల్ లైఫ్ గురించి కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఇప్పటి వరకూ తన కెరీర్‌లో చేసిన అన్ని క్యారెక్టర్స్‌తో పోలిస్తే యానిమల్‌లో చాలా కాంప్లికేటెడ్ క్యారెక్టర్లో నటించానని చాలాసార్లు చెప్పాడు. ట్రైలర్ చూస్తుంటే ఈ విషయం క్లియర్ గా అర్థమైపోతోంది.అందుకే షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ క్యారెక్టర్‌ను ఇంటికి తీసుకెళ్లకుండా చాలా జాగ్రత్తపడ్డానని చెప్పుకొచ్చాడు. ‘యానిమల్’లో తన పాత్ర చాలా ఇంటెన్స్‌గా ఉంటుందని, అందుకే షూటింగ్ ముగిసి ఇంటికి వెళ్లే సమయానికి తను రియల్ లైఫ్‌లో ఎలా ఉంటాడో అలా మారడానికి ప్రయత్నించేవాడని.. ఆన్‌స్క్రీన్ పర్సనాలిటీని ఇంటికి తీసుకెళ్తే.. అది తమను ప్రేమించే వారికి మంచిది కాదన్నాడు.
అక్కడితో ఆపేయకుండా.. ఇంటికి వెళ్లి ఇలాగే ప్రవర్తిస్తే నా భార్య నన్ను కొడుతుంది అని ఫన్నీ స్టేట్‌మెంట్ కూడా ఇచ్చాడు. ‘యానిమల్’ మూవీలో ఇప్పటివరకూ చూడని రణబీర్ కపూర్‌ను చూపించాడు సందీప్.