Ranbir Kapoor: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ రామాయణం మూవీ చేయబోతున్నాడు. ఈ పురాణం తాలూకు మూవీ సెట్లో అడుగుపెట్టబోతున్నాడు. అంతకుముందే తనలో తాను చాలా మార్పులు తీసుకొచ్చాడు. మందు మానేశాడు. నాన్ వెజ్‌కి దూరంగా ఉంటున్నాడు. ఇంకా షూటింగ్ షురూ కాలేదు. రాముడి పాత్రలో ఇంకా తాను దూరలేదు. ఇంతలోనే రాముడు మంచి బాలుడనేలా తయారవుతున్నాడు రణ్‌బీర్ కపూర్. ఆల్రెడీ ఆదిపురుష్ మూవీ చేసేటప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్ కూడా నాన్ వెజ్‌కి దూరంగా ఉన్నాడు.
ఆల్కహాల్ జోలికే పోలేదట. అంత నిష్టగా ఈ నియమాలు పాటించాడని తెలుస్తోంది. ఇప్పుడు రణ్‌బీర్ కపూర్ వంతొచ్చింది. దంగల్ మూవీ తీసిన నితీష్ తీవారి మేకింగ్‌లో అల్లు అరవింద్ అండ్ కో రామాయణం నిర్మిస్తున్నారు. ఆ సినిమాలోనే రాముడిగా రణ్‌బీర్ కపూర్, రావణుడిగా కేజీయఫ్ ఫేం యశ్ నటించబోతున్నారు. ఇక సీతగా సాయిపల్లవి కనిపించబోతోంది. అంతా బానే ఉంది కాని, బీఫ్ తీంటాడనే చెడ్డ పేరు రణ్‌బీర్ కపూర్ మీద ఉండటం వల్లే బ్రహ్మస్త్ర మూవీ ప్రమోషన్ టైంలో చాలా ట్రోలింగ్ జరిగింది. బీఫ్ తినే వ్యక్తి ఎలా శివలింగం అభిషేకం చేస్తాడని అప్పట్లోనే తిట్టిపోశారు. ఏదేమైనా గుళ్లూ, గోపురాలు తిరిగిన పుణ్యం వల్ల రణ్‌బీర్ కపూర్ మీద ట్రోలింగ్ తగ్గి, యావరేజ్ కంటెంట్ ఉన్న బ్రహ్మాస్త్ర కూడా ఆడింది.
ఇప్పుడు రామాయణంతో సౌత్, నార్త్ అంతటా పాతుకుపోయే ప్రయత్నం చేస్తున్నాడు. యానిమల్ హిట్టైతే తన ఇమేజ్ పెరుగుతుంది. రామాయణంలో ఫ్యామిలీ ఆడియన్స్‌లో మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంది. మొత్తానికి చాలా తెలివిగా కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నాడు రణ్‌బీర్.