ANIMAL: సందీప్ రెడ్డివంగ మీద బాలీవుడ్‌లో ఓ బ్యాచ్ అదే పనిగా ట్రోలింగ్ చేస్తోంది. గతంలోనే అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ విషయంలో ఇలాంటి ట్రోలింగ్సే ఫేస్ చేసిన సందీప్ రెడ్డి అసలు వయొలెన్స్ అంటే ఏంటో చూపిస్తానంటూ యానిమల్ మూవీని తెరకెక్కించాడు. ఐతే ఇందులో కూడా అర్జున్ రెడ్డి మూవీలాగే కిస్ సీన్‌లు కాంట్రవర్సీగా మారుతున్నాయి. హీరోయిన్‌ని డమ్మీగా చూపించారని, ముద్దుసీన్ బాలేదని టీజర్‌ని తప్పు పడుతున్నారు.
ఇంతకు భయంకరమైన రొమాంటిక్ సీన్లతో వచ్చిన హిందీ మూవీలతో పోలుస్తూ కొంతమంది, అదేపనిగా యానిమల్ టీజర్‌ని ట్రోల్ చేస్తున్నారు. కొందరైతే టవల్ మీద రణ్ బీర్ కపూర్ కనిపించటాన్ని భారీగా తప్పుపడుతున్నారు. మహిళల్ని కించపరిచారనే విధంగా కూడా కామెంట్స్ పెరిగాయి. ఏదేమైనా అర్జున్ రెడ్డి టైంలో ముద్దుసీన్ వివాదంగా మారింది. ఈసారి ముద్దుతోపాటు టవల్ కూడా కాంట్రవర్సీకి కారణమైంది. ఏదేమైనా అర్జున్ రెడ్డి హిట్ తర్వాత బూతులు, ముద్దులు వీటి మీదొచ్చిన కామెంట్లు గాల్లో కలిసిపోయాయి. అలానే యానిమల్ సీన్స్ కూడా వివాదాస్పదం అవుతాయో లేదో కాని.. ఇది ఫ్రీ ప్రమోషన్‌లా మాత్రం పనికొస్తోంది.