Ranveer Singh: పటాన్ మూవీ వెయ్యికోట్లు రాబట్టింది. జవాన్ 1000 కోట్లు రాబడితే డంకీ రూ.500 కోట్లతో సరిపెట్టింది. ఎలా చూసినా 2500 కోట్ల మార్కెట్ ఉన్న స్టార్ షారుఖ్ అని ప్రూవ్ అయ్యింది. అలాంటి తనతోనే డాన్ అంటూ రెండు భాగాలు తీశాడు ఫర్హాన్ అక్తర్. కాని ఏనాడు 200 కోట్లకు బడ్జెట్ రీచ్ కాలేదు. కాని డాన్ 3 కోసం రూ.275 కోట్ల బడ్జెట్ ప్లాన్ చేశాడు.
kalki 2898 AD: 22 భాషల్లో.. ఒకే ఒక్క పాటకి రెబల్ చిందులు..?
అది కూడా షారుఖ్ కాకుండా ఆ రోల్‌లో రణ్ వీర్ సింగ్ చేస్తుండటం, తనకి ఇంత భారీ పెట్టుబడి పెట్టాల్సి రావటం చూస్తుంటే, ఫర్హాన్ రిస్క్ చేస్తున్నాడటంటున్నారు. డాన్ 3 లో షారుఖ్ బదులు రణ్ వీర్ సింగ్ డాన్‌గా కనిపించబోతన్నాడంటేనే కామెంట్లు పెరిగాయి. కారణం ఈ కటౌట్‌కి అంతలేదనే అభిప్రాయం ఉండటం. కాకపోతే అమితాబ్ తర్వాత డాన్‌గా షారుఖ్ మారబోతుంటే కూడా ఇలానే కామెంట్స్ వచ్చాయి. తర్వాత డాన్ సక్సెస్‌తో వాటికి బ్రేక్ పడ్డాయి. అలానే రణ్‌వీర్ సింగ్ కూడా చేస్తాడో లేదో కాని, మరీ 175 కోట్లు మేకింగ్‌కి, ఇక 100 కోట్లు హీరోలకి అంటున్నారు.
ఇక్కడే సెటైర్లు పేలుతున్నాయి. బాలీవుడ్‌లో ఆదిపురుష్, ఫైటర్ మూవీలు వందలకోట్లు పెట్టి తీసి వందకోట్లు మించి రాబట్టడానికి కిందా మీద పడ్డారు. మరి జనాల్లో అంత ఆసక్తి లేని డాన్ సిరీస్‌కి 275 కోట్లంటే పెట్టుబడి వచ్చేదెలా? అన్న డౌట్లు పెరిగాయి.