అల్లు అర్జున్ మగాడు, టాలీవుడ్ లో ఆ దమ్ము ఎవడికి లేదు, రష్మిక సెన్సేషన్

అల్లు అర్జున్... పుష్ప పార్ట్ 2 సినిమా ఇప్పుడు నార్త్ ఇండియాలో దుమ్ము రేపుతోంది. నార్త్ ఇండియాలో ఆ రేంజ్ లో సక్సెస్ అవుతుందని అసలు అల్లు అర్జున్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సినిమా నార్త్ ఇండియన్ సినిమా లాగా ఉండటంతో అక్కడి ఫ్యాన్స్ కు పిచ్చపిచ్చగానే నచ్చేసింది.

  • Written By:
  • Publish Date - December 21, 2024 / 07:13 PM IST

అల్లు అర్జున్… పుష్ప పార్ట్ 2 సినిమా ఇప్పుడు నార్త్ ఇండియాలో దుమ్ము రేపుతోంది. నార్త్ ఇండియాలో ఆ రేంజ్ లో సక్సెస్ అవుతుందని అసలు అల్లు అర్జున్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సినిమా నార్త్ ఇండియన్ సినిమా లాగా ఉండటంతో అక్కడి ఫ్యాన్స్ కు పిచ్చపిచ్చగానే నచ్చేసింది. అల్లు అర్జున్ మేనరిజం, అలాగే అందులో వాడిన కాస్ట్యూమ్స్ అన్నీ కూడా నార్త్ ఇండియన్స్ కు నచ్చే విధంగానే ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో అల్లు అర్జున్ నటన నార్త్ ఇండియన్స్ కు పిచ్చపిచ్చగానే వచ్చింది.

ఆ చేతికి ఉంగరాలు, మెడలో గోల్డ్ ఆ బట్టలు అన్నీ కూడా నార్త్ ఇండియన్ మాదిరిగానే ఉన్నాయి. దీనితో సినిమా చూడటానికి ఇప్పటికీ అక్కడ జనాలు ఎగబడుతున్నారు. ఒక్కొక్కరు రెండు మూడు సార్లు ఈ సినిమా చూశారు. అందుకే తెలుగులో కంటే నార్త్ లో ఈ సినిమాకు వసూళ్లు భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో జాతర సీక్వెన్స్ జనాలను పిచ్చెక్కించింది. థియేటర్లో సినిమా చూసేవాళ్ళకు నిజంగా పూనకాలు వచ్చాయి. తాజాగా సోషల్ మీడియాలో రష్మిక మందన ఈ సీక్వెన్స్ గురించి మాట్లాడుతూ హాట్ కామెంట్స్ చేసింది.

రష్మిక మందన ఒక ప్రముఖ వెబ్సైట్ కి ఇంటర్వ్యూ ఇచ్చి… ఈ సినిమాలో అల్లు అర్జున్ యాక్టింగ్ అలాగే సుకుమార్ డైరెక్షన్ సహాబ్ అనేక విషయాలు బయటపెట్టింది. జాతర సీక్వెన్స్ లో బన్నీ యాక్టింగ్ గురించి మాట్లాడిన రష్మిక జాతర సీన్ చూసాక ఆ రేంజ్ లో అల్లు అర్జున్ మాత్రం యాడ్ చేయగలరు అనిపించింది అంటూ కామెంట్ చేసింది. నేను నా జీవితంలో అల్లు అర్జున్ చేసిన అలాంటి ఆక్టింగ్ చూస్తానని అనుకోలేదని… అసలు మీరు ఊహించండి ఒక చీర కట్టుకుని డాన్స్ చేయడం, ఫైట్ చేయడం డైలాగ్ చెప్పటం ఇవన్నీ ఎంత ధైర్యం ఉండాలి… పవర్ కావాలి అంటూ కామెంట్ చేసింది.

సినిమాలో మొత్తం 21 నిమిషాలు బన్నీ చీరలోనే ఉంటాడు అంటూ ఆమె ఆకాశానికి ఎత్తేసింది. అయితే గతంలో ఇలా చీర కట్టుకొని కొన్ని సినిమాలొచ్చాయి. సూపర్ డీలక్స్, కాంచన వంటి సినిమాల్లో విజయ్ సేతుపతి, శరత్ కుమార్, లారెన్స్ కమల్ హాసన్ వంటి వారు చీర కట్టుకుని యాక్టింగ్ చేశారు. మరి రష్మిక అల్లు అర్జున్ లో అంత గొప్ప యాక్టింగ్ ఏం చూసింది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. అల్లు అర్జున్ బాగా చేశాడు గాని ఇంకెవరూ చేయలేరు అనడం కరెక్ట్ కాదంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇక ఈ సినిమాలో రష్మిక యాక్టింగ్ కు కూడా మంచి మార్కులు పడ్డాయి. ఆమె నుంచి ఆడియన్స్ ఆ రేంజ్ లో యాక్టింగ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్ అయి 20 రోజులు దగ్గర పడుతున్న సరే సినిమా వసూళ్లు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు.