పాన్ ఇండియా బ్యూటీ రష్మిక సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. యానిమల్ రిలీజ్ తర్వాత రష్మికకు ఫాలోయింగ్ ఒక్కసారిగా పెరిగింది. యానిమల్‌లో యాక్టింగ్తో ఇంప్రెస్ చేసి ఇన్‌స్టాలో ఫాలోవర్స్‌ను పెంచేసుకుంది రష్మిక. స్టార్ ఇమేజ్ వుండి.. సోషల్ మీడియాలో కాస్త యాక్టీవ్‌గా వుంటే చాలు.. మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ వస్తారు. పుష్ప హిట్ తర్వాత వచ్చిన పాన్ ఇండియా ఇమేజ్‌తో రష్మిక ఇన్‌స్టాకు అనుచరుల సంఖ్య క్రమంగా పెరుగుతూ అది 40 మిలియన్‌కు చేరింది.
రష్మిక గుడ్‌బైతో హిందీలోకి అడుగుపెట్టి రెండు సినిమాలు చేసినా రాని గుర్తింపు యానిమల్ తీసుకొచ్చింది. రీసెంట్‌గా ఇన్‌స్టాలో 40 మిలియన్ ఫాలోవర్స్ క్లబ్‌లో చేరింది రష్మిక. సమంత .. కాజల్.. తమన్నా.. తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి 10 నుంచి 15 ఏళ్లవుతోంది. వీళ్లెవరికీ లేనంత క్రేజ్ రష్మిక సొంతం చేసుకుని.. క్రష్మిక అని పిలిపించుకుంటోంది. 2018లో ఛలో మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక తక్కువ టైంలో 40 మిలియన్ ఫాలోవర్స్‌తో తెలుగు భామల్లో టాప్ ప్లేస్‌కు చేరింది.
ఇన్‌స్టాలో ఏదో ఒక ఫొటోతో.. వీడియోతో కనిపించే సమంతకు ప్రస్తుతం 30 మిలియన్ ఫాలోవర్స్ వున్నారు. రష్మిక తర్వాత ఎక్కువ ఫాలోవర్స్ వున్న తెలుగు హీరోయిన్స్‌లో సెకండ్ ప్లేస్ సమంతదే. టాప్ హీరోల పక్కన నటించకపోయినా.. ప్రస్తుతం చేతిలో ఒక్క సినిమా లేకపోయినా.. ఇన్‌స్టాలో యమా యాక్టీవ్‌గా వుంటూ ఫాలోవర్స్‌ను పెంచుకుంటోంది సామ్.
ఒకప్పుడు తెలుగులో ఎక్కువ ఫాలోవర్స్ వున్న హీరోయిన్ కాజల్. ఇన్‌స్టాలో గ్లామర్ ఫొటోలతో కవ్విస్తూ వుండే చందమామ పెళ్లి తర్వాత ఫాలోవర్స్‌ను సంపాదించడంలో కాస్త వెనుకపడినా.. మూడో ప్లేస్‌ను కంటిన్యూ చేస్తోంది.
ఇన్‌స్టా మిలియన్ రేసులో ఎక్కడో వెనకున్న పూజా హెగ్డే.. అల వైకుంఠపురంలో సూపర్‌హిట్ తర్వాత ఫాలోవర్స్‌ని పెంచుకుంది. అయితే.. ఈమధ్య వరుస ఫ్లాపులతో క్రేజ్ తగ్గింది. దీనితోపటు.. పాలోవర్స్ తగ్గినా.. 25 మిలియన్ అనుచరులను మెయిన్‌టేన్ చేస్తోంది పూజా. సరైన హిట్ పడితేగానీ. 30 మిలియన్ మార్క్ చేరలేదు. 24.4 మిలియన్ ఫాలోవర్స్‌తో శృతిహాసన్.. 23 మిలియన్ అనుచరులతో రకుల్ ఐదారు స్థానాల్లో వున్నారు. ప్రియుడు శాంతను హజారికతో ముద్దులు ముచ్చట్లతో శృతి ఇన్‌స్టాను నింపేయడం శృతి ఫ్యాన్స్‌కు నచ్చడం లేదు. దీంతో చాలాకాలంగా 24 మిలియన్ మార్క్ దాటలేకపోతోంది శృతి.
రకుల్ ఇన్‌స్టా ఓపెన్ చేస్తే.. వర్కవుట్సే ఎక్కువ కనిపిస్తాయి. లేదంటే గ్లామర్ ఫొటోలతో ఇన్‌స్టాను హీటెక్కిస్తుంది. ఇవన్నీ రొటీన్ కావడం.. తెలుగులోనే కాదు.. హిందీలో కొత్త సినిమాలు లేకపోవడంతో ఆరో ప్లేస్‌కు వెళ్లిపోయింది రకుల్.