Deepika Padukone: ఈ ఏడాది పాన్ ఇండియా హీరోయిన్ రేసు.. ఈ ఇద్దరి మధ్యే..

అతిలోక సుందరి శ్రీదేవి కూతురైన తను తెలుగు మూవీతో పాన్ ఇండియా మార్కెట్ మీద ఎటాక్ చేయబోతోంది. ఇక కల్కితో దండెత్తబోతోంది దీపికా పదుకొనే. ఇదే కాదు హ్రితిక్‌తో తను చేసిన ఫైటర్ మూవీతో కూడా దీపికా పాన్ ఇండియా ఎటాక్‌కి రెడీ అయ్యింది.

  • Written By:
  • Publish Date - January 8, 2024 / 08:51 PM IST

Deepika Padukone: 2024లో పాన్ ఇండియా హిట్ మూవీ ఏది అనేకంటే, పాన్ఇండియా హీరోయిన్‌గా ఈ ఏడాది నెంబర్ వన్ అనిపించుకునేదెవరనే ప్రశ్నే ఎదురౌతోంది. రాబోయే సినిమాల పరంగా చూస్తే ఈ ఏడాది పాన్ ఇండియా ఎటాక్ అంతా టాలీవుడ్ నుంచే ఉండోబోతోంది. ఆరకంగా తెలుగు హీరోయినే పాన్ ఇండియా నెంబర్ వన్ అనిపించుకునే ఛాన్స్ ఉంది. కాని అలా జరగట్లేదు. దేవర ఏప్రిల్ 5న రానుంది. ఇందులో హిందీ హీరోయిన్ జాన్వీ కనిపించబోతోంది.

MEGASTAR CHIRANJEEVI: సెకండ్ ఇన్నింగ్స్‌లో భారీ సాహసం చేస్తున్న మెగాస్టార్..

అతిలోక సుందరి శ్రీదేవి కూతురైన తను తెలుగు మూవీతో పాన్ ఇండియా మార్కెట్ మీద ఎటాక్ చేయబోతోంది. ఇక కల్కితో దండెత్తబోతోంది దీపికా పదుకొనే. ఇదే కాదు హ్రితిక్‌తో తను చేసిన ఫైటర్ మూవీతో కూడా దీపికా పాన్ ఇండియా ఎటాక్‌కి రెడీ అయ్యింది. ఇక యానిమల్‌తో లాస్ట్ ఇయర్ పాన్ ఇండియా టాప్ హీరోయిన్ అనిపించకున్న రష్మిక, ఈ ఏడాది పుష్ప 2 తో పాన్ ఇండియా మార్కెట్‌ని షేక్ చేయబోతోంది. రామ్ చరణ్‌తో జోడీకట్టిన కియారా అద్వాని గేమ్ ఛేంజర్‌తో పాన్ ఇండియా మార్కెట్ మీద దసరాకు దండెత్తబోతుంటే, ఫ్యామిలీ స్టార్ అంటూ విజయ్ దేవరకొండతో మృణాల్ ఠాకూర్ దాడికి రెడీ అయ్యింది. ఇలా పాన్ ఇండియా మూవీల లిస్ట్ చూస్తే ఈ ఏడాది పాన్ ఇండియా నెంబర్ వన్ రేసు, దీపికా పదుకొనే, రష్మిక మధ్యే ఉన్నట్టుంది.

హిందీ ఫైటర్, తెలుగు కల్కితో దీపికా రెండు భారీ ఎటాక్స్ చేయబోతుంటే, ఆరెండీంటికి ధీటైన మూవీ పుష్ప సీక్వెల్‌లో రాబోతోంది రష్మిక. అందుకే అసలు పోటీ ఈ ఇద్దరి మధ్యే ఉంది. ఏదైనా మిరాకిల్ జరిగితే, దేవరతో జాన్వీ, గేమ్ ఛేంజర్‌తో కియారా పాన్ ఇండియా నెంబర్ వన్ అనిపించుకునే ఛాన్స్ ఉంది.