Rashmika Mandanna: పాపం రష్మిక.. మరోసారి డీప్‌ఫేక్ వీడియో వైరల్

రష్మిక గతేడాది డీప్ ఫేక్ బారిన పడిన సంగతి తెలిసిందే. ఆమె డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై రష్మిక అప్పట్లో తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. దీనివల్ల తాను మానసిక వేదనకు గురవుతున్నట్లు తెలిపింది.

  • Written By:
  • Publish Date - March 12, 2024 / 07:47 PM IST

Rashmika Mandanna: నేషనల్ క్రష్‌గా పేరు తెచ్చుకున్న రష్మిక మందన్న మరోసారి డీప్ ఫేక్ వీడియో బారిన పడింది. ఆమెకు సంబంధించిన ఒక డీప్ ఫేక్ వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కనిపించింది రష్మిక కాదని తర్వాత తెలిసింది. రష్మిక గతేడాది డీప్ ఫేక్ బారిన పడిన సంగతి తెలిసిందే. ఆమె డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై రష్మిక అప్పట్లో తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. దీనివల్ల తాను మానసిక వేదనకు గురవుతున్నట్లు తెలిపింది.

PRABHAS: ఒకేసారి ఇన్ని సినిమాలా.. ప్రభాస్‌కు ఎలా సాధ్యం..?

రష్మికకు పలువురు సెలబ్రిటీలు కూడా మద్దతు తెలిపారు. ఈ వీడియోపై పోలీసులు కేసు నమోదు చేసి, వీడియో రూపొందించి, వైరల్ చేసిన నిందితుడిని పట్టుకున్నారు. దీంతో రష్మిక ఈ డీప్ ఫేక్ వివాదం నుంచి బయటపడింది. ఇది జరిగిన కొద్ది రోజులకే ఇప్పుడు రష్మికకు చెందిన డీప్ ఫేక్ వీడియో వైరల్ అవుతోంది. మొదటి వీడియోలాగే.. ఈ వీడియోలో కూడా రష్మిక గ్లామరస్‌‌గానే కనిపించింది. ఇలాంటి అభ్యంతరకర వీడియోల్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి డీప్ ఫేక్ టెక్నాలజీతో తయారు చేస్తున్నారు. వేరే వారి ముఖానికి రష్మిక ఫేస్ యాడ్ చేసి తాజా వీడియో రూపొందించారు. ఇందులో ఓ యువతి డ్యాన్స్ చేస్తూ కనిపించింది. దీనికి రష్మిక ముఖాన్ని డీప్ ఫేక్ ద్వారా ఎడిట్ చేశారు. తాజా వీడియోపై నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు స్పందించి, ఇలాంటి వీడియోలు రూపొందిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

నిందితుడిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. టెక్నాలజీ ద్వారా ఇలాంటి ఇబ్బందికర పరిణామాలు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే, వరుసగా రష్మిక ఇలాంటి డీప్ ఫేక్ వీడియోల బారిన పడుతుండటంపై ఆమె అభిమానుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజంగా రష్మికకు ఇలాంటి పరిస్థితి తలెత్తకూడదని కోరుకుంటున్నారు. ఈ వీడియోపై రష్మిక ఎలా స్పందిస్తుందో చూడాలి. రష్మిక ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2లో నటిస్తోంది. అల్లు అర్జున్ సరసన మరో సారి శ్రీవల్లిగా సందడి చేయడానికి రెడీ అవుతుంది.