Rashmika Mandanna: లేడీ యానిమల్‌కి బంపర్ ఆఫర్.. వరుసగా పాన్ ఇండియా ఆఫర్లు

పుష్పతో పాన్ ఇండియా హిట్ సొంతం చేసుకున్న రష్మిక, తర్వాత యానిమల్‌తో మరో పాన్ ఇండియా హిట్ సొంతం చేసుకుంది. ఇప్పుడు యానిమల్‌లో తన పనితనం నచ్చి సందీప్ రెడ్డి వంగ స్పిరిట్‌లో ఛాన్స్ ఇచ్చాడు.

  • Written By:
  • Publish Date - February 7, 2024 / 08:24 PM IST

Rashmika Mandanna: రష్మిక మందన్న టాలీవుడ్‌లో 3 కోట్లపైనే తీసుకుంటున్న హీరోయిన్. తను ఎంత నేషనల్ క్రష్ అయినా తన క్రేజ్ సౌత్‌లో తగ్గుతోంది. యానిమల్ హిట్ అయ్యుండొచ్చు. పుష్ప 2లోనూ నటిస్తూ ఉండొచ్చు. కాని తనకి ఇండస్ట్రీలో పెద్దగా ఆఫర్ల వరద లేదు. ఇందులో లక్ ఏంటంటే, అచ్చొచ్చిన సినిమాలకు సీక్వెల్స్‌తో పాటు, వాటిని తీసే దర్శకుడు మళ్లీ మళ్లీ ఈ హీరోయిన్‌నే ప్రిఫర్ చేయటం.

PUSHPA 2: పుష్ప 3 కోసం లెక్క మార్చేసిన డైరెక్టర్ సుకుమార్

నిజమే.. పుష్పతో పాన్ ఇండియా హిట్ సొంతం చేసుకున్న రష్మిక, తర్వాత యానిమల్‌తో మరో పాన్ ఇండియా హిట్ సొంతం చేసుకుంది. ఇప్పుడు యానిమల్‌లో తన పనితనం నచ్చి సందీప్ రెడ్డి వంగ స్పిరిట్‌లో ఛాన్స్ ఇచ్చాడు. ఆల్రెడీ యానిమల్ సీక్వెల్ యానిమల్ పార్క్‌లో కూడా రష్మికనే హీరోయిన్‌గా మెరవక తప్పదు. అది కాకుండా ప్రబాస్‌తో సందీప్ తీసే సినిమాలో కూడా రష్మికకే ఆఫర్ దక్కితే అంతకంటే అదృష్టం ఉండదు. విచిత్రం ఏంటంటే పుష్ప 3 కూడా సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడంటున్నారు. అది నిజమైతే, పుష్ప 2, పుష్ప 3, యానిమల్ పార్క్, స్పిరిట్ ఇలా నాలుగు పాన్ ఇండియా మూవీలతో కనీసం రెండేళ్ల వరకు రష్మికకు ఢోకా లేదు. అంతేకాదు, మొన్న కల్కిలో ప్రభాస్‌తో జోడీ కట్టిన దీపికాతో జోడీ కట్టేందుకు బన్నీ సిద్దమయ్యాడు.

త్రివిక్రమ్ మేకింగ్‌లో ప్రాజెక్ట్ కన్ఫామ్ చేశాడు. ఇప్పడు బన్నీ లేడీ శ్రీవల్లితో ప్రభాస్ జోడీ కడుతున్నాడు. అలానే దేవర బ్యూటీ జాన్వీతో రామ్ చరణ్ మూవీ కన్ఫామ్ అయ్యేలా ఉంది. ఇలా ఎంతమంది హీరోయిన్లున్నా, వీళ్లు చేసే పాన్ ఇండియా మూవీలకు మాత్రం జోడీలను రిపీట్ చేస్తున్నారు. ఎవరూ లేనట్టు హీరోయిన్లను ఎక్స్‌ఛేంజ్ చేసుకుంటున్నారు.