Rashmika Mandanna: రౌడీహీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నల మధ్య ఏదో వ్యవహారం నడుస్తోందని టాలీవుడ్ ఓపెన్ టాక్. ఇద్దరూ తమ మధ్య ఏమీ లేదని పైకి చెబుతున్నా సరే ఇద్దరు కలవాల్సిన టైంలో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. విజయ్ ఎక్కడ ఉంటే రష్మిక అక్కడ కనిపిస్తూ షాక్ ఇస్తుంటుంది. ఇక లేటెస్ట్‌గా న్యూ ఇయర్ పార్టీ కోసం అప్పుడే లెక్కలు వేసుకుంటున్నట్లు ఓ న్యూస్ చక్కర్లు కొడుతుండగా.. శ్రీవల్లి తాజాగా పోస్ట్ చేసిన మ్యాటర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అటు సినిమాలతో.. ఇటు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది రష్మిక.
ANIMAL: యానిమల్ మూవీ కొంపముంచిన తమిళ హీరో..?
ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లతో టచ్‌లో ఉంటుంది. కొన్నిసార్లు అభిమానులతో లైవ్ చిట్ చాట్స్ చేస్తూ సినిమా అప్డేట్స్, వ్యక్తిగత విషయాలను పంచుకుంటుంది. తాజాగా ప్రస్తుతం ఈ బ్యూటీ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. ఈ పోస్ట్ తన ప్రియుడు విజయ్ దేవరకొండ కోసమే పెట్టినట్లుంది అని నెటిజన్లు భావిస్తున్నారు. నేను ఏదైనా నీకు చెప్పాలి అంటే కేవలం థాంక్స్ మాత్రమే చెప్పగలనని.. నువ్వు నా జీవితంలోకి వచ్చినందుకు కృతజ్ఞతలు అంటూ రష్మిక పోస్ట్ చేసింది. కానీ ఎవ్వరినీ ట్యాగ్ చేయలేదు. దీంతో రష్మిక విజయ్ కోసమే ఆ పోస్ట్ పెట్టిందని ఎవరికి వారు అనేసుకుంటున్నారు. ఇప్పటికే చాలా సార్లు ఇద్దరూ అడ్డంగా దొరికేసారు. ఇక త్వరలో తమ పెళ్లి గురించి అఫీషియల్‌గా కన్‌ఫాం చేస్తారేమోనని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.
వరుస సినిమాలతో దూసుకెళ్తున్న రష్మిక.. విజయ్‌తో సీక్రెట్ రిలేషన్‌షిప్‌పై నోరు విప్పట్లేదు. విజయ్ కూడా రష్మికతో వచ్చే కామెంట్స్‌ని ఎంజాయ్ చేస్తాడు తప్ప అసలు రెస్పాండ్ అవ్వడం లేదు. రష్మిక.. దేవరకొండ ఇంట్లో జరిగే ప్రతి ఫంక్షన్‌కు హాజరవుతోంది. ఇదిలా ఉంటే.. ఫారెన్ టూర్‌లో చిల్ అవుతున్నాడు విజయ్ దేవరకొండ. నైట్ లైట్ డిన్నర్‌లో రౌడీ హీరో ఎంజాయ్ చేస్తున్నఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ టైంలో రష్మిక చేసిన పోస్ట్ హాట్ టాపిక్ గా మారింది. మరి విజయ్, రష్మికల రిలేషన్ షిప్ పై ఎప్పుడు క్లారిటీ ఇస్తారన్నది అందరు ఎదురుచూస్తున్నారు.