raviteja : రవన్న దావత్ ఇస్తుండు.. రెడీ అయిపోండ్రి

రవితేజ నుంచి అదిరిపోయే మాస్ ఎంటర్టైనర్ కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసున్నారు. ఇప్పుడు ఈ 75వ చిత్రం అలాగే ఉండబోతుందని తెలుస్తోంది.

రవితేజ నుంచి అదిరిపోయే మాస్ ఎంటర్టైనర్ కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసున్నారు. ఇప్పుడు ఈ 75వ చిత్రం అలాగే ఉండబోతుందని తెలుస్తోంది. అనౌన్స్‌మెంట్ పోస్టర్ తోనే ఈ సినిమా ‘దావత్’లా ఉండబోతుందని తెలిపారు మేకర్స్. భారీస్థాయిలో నిర్వహించబడుతున్న ఊరి జాతరను చూపిస్తూ, సృజనాత్మకంగా రూపొందించిన పోస్టర్ ఆకట్టుకుంటోంది.

రవితేజ 75వ చిత్రం అని తెలుపుతూ కళ్ళద్దాల మీద ‘RT 75’ అని రాయడం బాగుంది. అలాగే పోస్టర్ మీద “రవన్న దావత్ ఇస్తుండు. రెడీ అయిపోండ్రి”, “హ్యాపీ ఉగాది రా భయ్” అని తెలంగాణ యాసలో రాసి ఉండటం గమనించవచ్చు. దీనిని బట్టి చూస్తే తెలంగాణ నేపథ్యంలో సాగే చిత్రమని అర్థమవుతోంది. ఈ సినిమాలో రవితేజ పాత్ర పేరు “లక్ష్మణ భేరి” అని తెలిపిన మేకర్స్.. ఈ పాత్ర తీరు ఎలా ఉండబోతుందో కూడా ఉగాది పంచాంగం రూపంలో చెప్పారు. “ఆదాయం: చెప్పను తియ్. ఖర్చు: లెక్క జెయ్యన్.. రాజ్యపూజ్యం: అన్ లిమిటెడ్.. అవమానం: జీరో” అంటూ రవితేజ పోషిస్తున్న పాత్ర గురించి పోస్టర్ పై రాసుకొచ్చిన తీరు భలే ఉంది.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. 2025 సంక్రాంతికి ఈ సినిమాని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. మరి వచ్చే సంక్రాంతికి రవితేజ దావత్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.