Ravi Basrur: ఫిల్మ్ ఇండస్ట్రీలో లోకల్ ట్యాలెంటుకే ఛాన్సులు ఇవ్వాలన్న రూల్ లేదు. పాత పద్ధతులకు స్వస్తి చెప్పి కొత్తగా ట్రై చేసేవారికే ఆఫర్స్ ఇస్తున్నారు మేకర్స్. ముఖ్యంగా సాంగ్స్, బీజీఎం విషయంలో రాజీ పడటం లేదు. ఇదే ఓ స్టార్ మ్యూజిక్ కంపోజర్‌కి మైనస్‌గా మారింది. అర్జెంట్‌గా డిఫరెంట్ ఆల్బమ్‌తో ఫ్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అతడే.. రవి బస్రూర్. కేజీఎఫ్ విజయంలో కీలక పాత్ర పోషించిన మ్యూజిక్ డైరెక్టర్. రాఖీభాయ్ థీమ్ మ్యూజిక్, సాంగ్స్‌తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో ఆడియన్స్‌ని థ్రిల్ చేశాడు.
సౌండ్ ఎఫెక్స్ట్‌తో కొన్ని ఆర్డినరీ సీన్స్‌ని ఎక్స్ట్రార్డినరీగా మార్చాడు. మదర్ సెంటిమెంట్ సాంగ్‌ని సైతం ఛార్ట్ బస్టర్ చేయొచ్చని నిరూపించాడు. కేజీఎఫ్2 తర్వాత కబ్జా, అజయ్ దేవగన్ భోళా, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఛత్రపతి సినిమాలకు మ్యూజిక్ కంపోజ్ చేసినా.. చెప్పుకోదగ్గ రేంజ్‌లో ఆడియన్స్‌కి రిజిస్టర్ కాలేదు. ఎక్కడా తన మ్యాజిక్ రిపీట్ కాలేదు. రవి బస్రూర్ కెరీర్ మొత్తం ఇప్పుడు సలార్ రిజల్ట్ మీదే ఆదారపడి ఉంది. ప్రజెంట్ ఓన్ రికార్డింగ్ స్టూడియోలో ప్రశాంత్ నీల్‌తో కలిసి సలార్ వర్క్ ఫినిష్ చేస్తున్నాడు. ఇది కాక రవి బస్రూర్ చేతిలో ఏడుకి పైగా సినిమాలున్నాయి. నిఖిల్ స్వయంభు, గోపీచంద్ భీమా, శివరాజ్ కుమార్ భైరతి రనగల్, సత్యదేవ్ జీబ్రా, ధృవ సర్జ మార్టిన్ సినిమాలకు రవినే మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమాలకు హైప్ పెరగాలన్నా, తనలో కాన్ఫిడెన్స్ రెట్టింపు అవ్వాలన్నా డిసెంబర్ 22న రిలీజ్ అవుతున్న సలార్ బ్లాక్ బస్టర్ అవ్వాలి. తన మ్యూజిక్ హైలెట్‌గా నిలవాలి. అప్పుడే మిగిలిన ప్రాజెక్ట్స్ మీద మ్యూజిక్ లవర్స్ ఆశలు పెట్టుకుంటారు.
టాలీవుడ్ వరకు తమన్ కొత్త ట్యూన్స్‌తో దూసుకుపోతున్నాడు. దేవిశ్రీ ప్రసాద్‌లో మునుపటి వేగం తగ్గినప్పటికీ స్టార్ హీరోల ఛాన్సులు పడుతూనే ఉన్నాడు. మిక్కీ జే మేయర్‌కు అవకాశాలు బాగానే వస్తున్నాయి. ఏఆర్ రెహమాన్, యువన్ శంకర్ రాజా, హ్యారిస్ జైరాజ్ లాంటి సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్స్ మళ్ళీ ట్రాక్‌లోకి వస్తున్నారు. అనిరుద్ అయితే పాన్ ఇండియా రేంజ్‌లో దూసుకుపోతున్నాడు. వీళ్ళతో పోటీ పడే సత్తా రవి బస్రూర్‌కి ఉన్నా.. తిప్పి తిప్పి ఒకే తరహా స్కోర్ ఇస్తున్నాడనే కామెంట్స్ తనని వెనక్కి లాగేస్తున్నాయి. ఈ వార్తలకు చెక్ పడాలంటే ఒక డిఫరెంట్ ఆల్బమ్ పడాలి. లేదంటే రెండు సినిమాల వండర్‌గా రవి బస్రూర్ మిగిలిపోయే ఛాన్స్ ఉంది.