రామ్‌చరణ్, ఎన్టీఆర్.. బన్నీ వంటి స్టార్స్ ఒక సినిమాలో వున్నట్టు మరో మూవీలో కనిపించరు. సినిమా సినిమాకీ మేకోవర్ అయిపోతారు. ఏ మూవీ తీసుకున్నా.. ఒకేలా కనిపించే మాస్ రాజా కూడా మారిపోయాడు. న్యూ లుక్‌తో ముందుకొచ్చాడు. ఏ సినిమాలో చూసినా రవితేజ ఒకేలా వుంటాడు. ఖాకీ డ్రెస్ వేస్తే విక్రమార్కుడు.. క్రాక్ అని.. కాస్త హెయిర్ పెంచితే టైగర్ నాగేశ్వరరావు సినిమాలో గెటప్ అని గుర్తుపట్టడం తప్పితే.. చాలా సినిమాల్లో ఒకేలా వుంటాడు. జిమ్ రెగ్యులర్‌గా చేసే రవితేజా బాడీలో కూడా తేడా కనిపించదు.
రామ్‌చరణ్, బన్నీ.. ఎన్టీఆర్ వంటి స్టార్స్ ఒక సినిమా పూర్తయిన తర్వాతే మరో సినిమా చేస్తారు. క్యారెక్టర్‌కు తగ్గట్టు గెటప్ ఛేంజ్ అవుతూ డిఫరెంట్‌గా కనిపిస్తారు. మాస్ రాజా మాత్రం ఏడాదికి మూడు సినిమాలు చేయడంతో.. గెటప్ మార్చలేడు. ఎప్పుడూ ఒకే గెటప్‌లో కనిపించే రవితేజ ఎట్టకేలకు మేకోవర్ అయ్యాడు. కొత్త సినిమా ఈగిల్ కోసం హెయిర్ బాగా పెంచేసి.. గుబురు గడ్డంతో కొత్తగా కనిపిస్తున్నాడు. రీసెంట్గా రిలీజ్ చేసిన పాటతో కొత్త రవి తేజను పరిచయం చేశాడు మాస్ రాజా. మాస్ రాజా సామాన్యంగా మేకోవర్ కావడానికి ఇష్టపడడు. సినిమాల మీద సినిమాలు చేయడంతో.. ఒక రోల్ నుంచి మరో క్యారెక్టర్‌కు వెళ్లి గెటప్ మార్చే టైం వుండదు. లుక్ మార్చడానికి వీల్లేక ఎప్పుడూ ఒకేలా వుంటాడు. మరి ఈగిల్ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఏం చెప్పి ఒప్పించాడోగానీ.. కాస్త వెయిట్ పెరిగి.. హెయిర్‌స్టైల్ పూర్తిగా మారిపోయింది.