Ravi Teja: నయా రూట్.. రియల్ తుపాకీతో రవితేజ..

ఈ భారీ యాక్షన్‌ సన్నివేశాలను యూరప్‌లో చిత్రీకరించారట. సినిమాలోని కొన్ని సన్నివేశాల కోసం మాజీ ఆర్మీ ఆఫీసర్ సమక్షంలో రియల్ తుపాకీతో రవితేజ ట్రైనింగ్ తీసుకున్నాడట. ట్రైనింగ్‌లో భాగంగా రియల్ గన్స్, రియల్ బుల్లెట్స్‌ను వాడారట.

  • Written By:
  • Publish Date - November 28, 2023 / 05:17 PM IST

Ravi Teja: మాస్ మహారాజా రవితేజ.. హీరోగా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. సక్సెస్‌, ఫ్లాప్ అనే విషయాలతో సంబధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ప్రస్తుతం మాస్ మహారాజా చేస్తున్న మూవీ ‘ఈగిల్‌’. గత సినిమాల ఫలితాల గురించి పెద్దగా పట్టింపులేకుండా ప్రేక్షకులు, ఫ్యాన్స్ ఈగిల్ సినిమాపై ఆసక్తి కనబరుస్తున్నారు. కార్తీక్‌ ఘటమనేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో భారీ యాక్షన్‌ సన్నివేశాలు ఉన్నాయన్న లీకులు.. ఈ సినిమాపై హైప్‌ను పెంచేస్తున్నాయి.

SALAAR: సలార్ క్రేజ్.. దిమ్మతిరిగేలా బిజినెస్.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే..

ఈ భారీ యాక్షన్‌ సన్నివేశాలను యూరప్‌లో చిత్రీకరించారట. సినిమాలోని కొన్ని సన్నివేశాల కోసం మాజీ ఆర్మీ ఆఫీసర్ సమక్షంలో రియల్ తుపాకీతో రవితేజ ట్రైనింగ్ తీసుకున్నాడట. ట్రైనింగ్‌లో భాగంగా రియల్ గన్స్, రియల్ బుల్లెట్స్‌ను వాడారట. మాస్‌ మహరాజ్ ఎనర్జీతో యాక్షన్ సన్నివేశాలు ఓ రేంజ్‌లో వచ్చాయని మూవీ టీం లీకులు ఇస్తోంది. అంతేకాదు.. ఇటీవల వచ్చిన ప్రమోషనల్‌ వీడియో, పోస్టర్‌లు సినిమా స్థాయిని అమాంతం పెంచాయి. మరోసారి రవితేజ ఓ బ్లాక్ బస్టర్ సక్సెస్‌ను ఈ సినిమాతో దక్కించుకోబోతున్నాడు అనిపిస్తోందని రవితేజ ఫ్యాన్స్ చాలా నమ్మకంతో ఉన్నారు. ఈగిల్‌లో రవితేజలోని పూర్తి మాస్ యాంగిల్‌ను చూసే అవకాశముందని ఫ్యాన్స్‌ సంబరపడిపోతున్నారు.

అనుపమ పరమేశ్వరన్‌, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మరి.. ఈ సినిమా మాస్ మహరాజాకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాల్సిందే.