Ravi Teja: టైగర్ నాగేశ్వర రావుతో రవితేజ ఆ ఫీట్ అందుకుంటాడా..?

మాస్ మహారాజా రవితేజ సినిమా కెరియర్‌లో పవర్ ఫుల్ క్యారెక్టర్ ఏది అంటే టక్కున గుర్తోచ్చేది విక్రమ్ సింగ్ రాథోడ్. 2006లో రాజమౌళి తెరకెక్కించిన విక్రమార్కుడులో డుబల్ రోల్‌లో కనిపించి ఆడియన్స్‌ని థ్రిల్ చేశాడు రవితేజ. తర్వాత ఎన్ని కమర్షియల్ సినిమాలు చేసినా.. ఆ రేంజ్ క్యారెక్టర్ పడలేదు.

  • Written By:
  • Publish Date - October 8, 2023 / 08:08 PM IST

Ravi Teja: హీరోల రేంజ్ పెరగలంటే ఏదో ఒక సాలిడ్ హిట్ పడాలి. ఆడియన్స్‌కి ఆ ప్రాజెక్ట్ మెమరబుల్‌గా మిగలాలి. అప్పుడే ఇమేజ్‌తో పాటు మార్కెట్‌లో మైలేజ్ పెరుగుతుంది. దీనిపైనే ఫోకస్ పెట్టిన మాస్ మహారాజ్ టైగర్ నాగేశ్వరరావుతో ఆ ఫీట్‌ని అందుకోవాలని చూస్తున్నాడు. మరి ఈ క్రాక్ హీరో ప్లాన్ వర్క్ అవుట్ అవుతుందా..? మాస్ మహారాజా రవితేజ సినిమా కెరియర్‌లో పవర్ ఫుల్ క్యారెక్టర్ ఏది అంటే టక్కున గుర్తోచ్చేది విక్రమ్ సింగ్ రాథోడ్.

2006లో రాజమౌళి తెరకెక్కించిన విక్రమార్కుడులో డుబల్ రోల్‌లో కనిపించి ఆడియన్స్‌ని థ్రిల్ చేశాడు రవితేజ. తర్వాత ఎన్ని కమర్షియల్ సినిమాలు చేసినా.. ఆ రేంజ్ క్యారెక్టర్ పడలేదు. అందుకే టైర్2 హీరోగా మిగిలిపోయిన రవితేజకి చాలా కాలం తర్వాత టైగర్ నాగేశ్వరరావు రూపంలో పవర్ ఫుల్ క్యారెక్టర్ దక్కింది. ఈ ప్రాజెక్ట్‌తో తన ఫేట్‌నే మార్చేసుకోవాలని చూస్తున్నాడు మాస్ మహారాజా. టైగర్ నాగేశ్వరరావు నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్ ఓ రేంజ్‌లో పెలాయి.

స్టువర్ట్‌పురం బ్యాక్‌డ్రాప్, దొంగల వ్యవహారం, మాఫియా కనెక్షన్.. ఇలా హై వోల్టేజ్ వైబ్రేషన్స్ తెప్పించే అంశాలు కథలో ఉన్నాయి కాబట్టి ఈ ప్రాజెక్ట్ క్లిక్ అవ్వడానికి స్కోప్ ఉంది. మరి అదే జరిగితే టైర్2 స్టేజ్‌లో ఇరుక్కుపోయిన రవితేజ కెరీర్‌లో బిగ్ చేంజ్ వస్తుంది. పాన్ ఇండియా మార్కెట్‌తో పాటు నార్త్‌లో కూడా తన కటౌట్ ఎస్టాబ్లిష్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మరి టైగర్ నాగేశ్వరరావు సినిమా రవితేజకి ఆ ఛాన్స్ అందిస్తుందో లేదో చూడాలి.