RAVI TEJA: రవితేజ రీజెంట్‌గా చేసిన పాన్ ఇండియా మిస్టేక్ టైగర్ నాగేశ్వరరావు. ఒకవైపు భగవంత్ కేసరి, మరో వైపు లియో లాంటి క్రేజీ మూవీలు పోటీలో ఉన్నా, దసరా దరువుకే సై అన్నాడు. రిజల్ట్ రివర్స్ అవటంతో తేరుకున్నట్టున్నాడు. ఇదే తప్పు మళ్లీ రిపీట్ చేయకూడదనే కారణంతో తన కొత్త మూవీ ఈగిల్ రిలీజ్ డేట్ వాయిదా వేయించాడు.
ఈగిల్ మూవీ సంక్రాంతికి రంగంలోకి దిగనుందన్నారు. కాని సీన్‌లోకి గుంటూరు కారం ఆల్రెడీ వచ్చింది. అలానే రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మూవీ ఫ్యామిలీ స్టార్ కూడా అప్పుడే రానుంది. విచిత్రం ఏంటంటే వాయిదా పడుతుందనుకున్న హనుమాన్ కూడా పాన్ ఇండియా లెవల్లో జనవరి 12 కే రాబోతోందని ఫిల్మ్ టీం రూమర్లకు చెక్ పెట్టింది. ఇంత హెవీ కాంపిటీషన్ ఉన్నటైంలో రవితేజ తన ఈగిల్ మూవీతో పొంగల్ పోరులో నిలబడితే, థియేటర్ల సమస్యే కాదు.. బాక్సాఫీస్ లో వసూళ్ల సమస్య కూడా రావొచ్చు. టైగర్ నాగేశ్వరరావుని పోటీ లేని టైంలో రిలీజ్ చేస్తే కనీసం ఓపెనింగ్స్ అయినా బాగా వచ్చేవి.
ఈసారి అది కూడా దక్కకుండా అయ్యింది. అందుకే ఈగిల్ విషయంలో ఇలా చేయొద్దని జనవరి 13 నుంచి ఆనెల చివరికి వాయిదా వేస్తున్నారట. ఏదేమైనా టైగర్ నాగేశ్వరరావు ఫ్లాప్ తో రవితేజ సేఫ్ జోన్ లోకి వెళ్లాలనుకుంటున్నాడు. తమిళ తంగలాన్ కూడా సంక్రాంతికే బరిలోకి దిగుతుండటంతో రవితేజ నిర్ణయమే కరెక్ట్ అంటున్నారు. పోటీ పోటెత్తే టైంలో రిస్క్ చేయటం కంటే, ఫ్రీ టైంలో భారీ ఓపెనింగ్స్ తో పండగ చేసుకోవచ్చనే నిర్ణయానికి వచ్చిందట మాస్ మహారాజా టీం.