RAVITEJA: మాస్ మహా రాజ రవితేజతో ఈమధ్య గోపీచంద్ ప్లాన్ చేసిన మూవీ పట్టాలెక్కకముందే క్యాన్సిల్ అయ్యింది. దానికి కారణం రవితేజ తన పారితోషికాన్ని రూ.30 కోట్లకు పెంచటమే. అంత ఇచ్చుకోలేక మైత్రీ మూవీ మేకర్స్ వెనకడుగు వేశారు. ఇలా జరిగి రెండు నెలలే అవుతోంది. ఇంతలో రవితేజ మనసు మారిందో.. స్ట్రాటజీనే మార్చాల్సి వచ్చిందో కాని సడన్‌గా రెమ్యూనరేషన్ వద్దని పరేషాన్ చేస్తున్నాడు. నిర్మాతలు షాకయ్యేలా చేస్తున్నాడు.
DEVARA: అనిరుధ్ మ్యూజిక్‌పై విమర్శలు.. ఇదేంటి బ్రో..?
మాస్ మహారాజా రవితేజతో షాక్, మిరపకాయ్ లాంటి మూవీలు తీసిన హరీష్ శంకర్ ఇప్పడు మిస్టర్ బచ్చన్ అనే సినిమా తీస్తున్నాడు. హిందీ రేయిడ్ సినిమాకు ఇది తెలుగు రీమేక్. ఈ మూవీకే రవితేజనే కాదు, దర్శకుడు హరీష్ శంకర్ కూడా పారితోషికం తీసుకోవట్లేదట. కనీసం బేసిక్ ఇన్‌కమ్ కూడా ఎక్స్‌పెక్ట్ చేయట్లేదట. అంతా ఫ్రీ.. అందుకు బదులుగా సినిమాలో వాటా తీసుకుంటున్నారట. అటే మిస్టర్ బచ్చన్ మూవీ విడుదలయ్యాక వచ్చే కలెక్షన్స్‌లోనే కాదు, శాటిలైట్, డిజిటల్ రైట్స్‌లో కూడా వాటా తీసుకుంటున్నారట. అంతేకాదు 45 రోజుల్లో పూర్తయ్యేలా ప్లాన్ చేసిన ఈ మూవీకి నాన్ థియేట్రికల్ రైట్సే రూ.60 కోట్లొచ్చేఛాన్స్ ఉంది. ఓమాదిరిగా ఆడినా కనీసం రూ.40 కోట్ల వసూళ్లకు అవకాశం ఉంది.
సో వందకోట్లలో దర్శకుడు, హీరో, నిర్మాత ఎవరి వాటా తీసుకున్నా లెక్కల్లో తేడా వచ్చే చాన్స్ లేదు. అందుకే తన రూ.30 కోట్ల రెమ్యూనరేషన్ చూసి జడుసుకునే నిర్మాతలకి ఇలాంటి ఆఫర్ ఇస్తున్నాడట రవితేజ. అందరూ ఇదే ఫాలో అయి, సినిమాలు హిట్టైతేనే హీరోలకి నాలుగు రాళ్లు దక్కే పరిస్థితి ఉంటుంది..