Pushpa 2: ఎవరూ ఊహించని విధంగా పుష్ప 2 రిలీజ్ ఆగస్ట్ 15కు వెళ్లిపోయింది. ఎట్టిపరిస్థితుల్లో సమ్మర్‌లో రిలీజ్ చేయాలనుకున్న పుష్ప టీంను ఎవరు అడ్డుకున్నారు..? వాళ్లకు వాళ్లే ఈ బ్రేకులు వేసుకున్నారా..? ఎందుకు వెనక్కి వెళ్లాల్సివచ్చింది..? పుష్పతో అల్లు అర్జున్ ఉత్తయ జాతీయ నటుడయ్యాడు. ఈ అవార్డు అందుకున్న తొలి తెలుగు హీరో కూడా బన్నీనే. ఈ అరుదై అవార్డుతో పుష్ప 2 రిలీజ్ వాయిదాపడింది. అవార్డుకే కాదు.. పుష్ప2 రిలీజ్ వాయిదాకు మరో కారణం కూడా వుంది.
బన్నీ తొలి పాన్ ఇండియా మూవీ పుష్ప రిలీజైన ప్రతి లాంగ్వేజెస్‌లో హిట్ అయింది. ఈ రేంజ్‌లో సక్సెస్ అవుతుందని మేకర్స్ కూడా ఊహించలేదు. పుష్ప2 ఒక్కసారిగా హై ఎక్స్‌పెక్టేషన్స్‌లోకి వెళ్లిపోయింది. దీనికి తగ్గట్టు కథను మార్చాడు సుకుమార్. దాదాపు ఏడాదిపాటు స్క్రిప్ట్ వర్క్ నడిచింది. పుష్ప 2ను మరింత హిట్ చేయాలన్న భయంతో ఆలస్యమవుతూ వచ్చింది. జాతీయ అవార్డు రావడంతో.. పుష్ప2 ఇంకా ఆలస్యం అవుతుందా అన్న అనుమానాలను మేకర్స్ నిజం చేశారు. సినిమాను సమ్మర్ రిలీజ్‌కు రెడీ చేయాలనుకున్నారు. అయితే సినిమా ఆగస్ట్ 15న రిలీజ్ అంటూ అల్లు అర్జున్ పోస్టర్ రిలీజ్ చేశాడు. ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తికావడంతో మిగిలిన 30 పర్సెంట్ మరింత బెటర్‌మెంట్ చేయడానికి లెక్కల మాష్టారు టైం తీసుకున్నాడు. జాతీయ అవార్డు లెగసీని కంటిన్యూ చేయడానికి యాక్టింగ్‌తో మరింత ఆకట్టుకోవాలన్న పట్టుదలతో.. సినిమా రిలీజ్ ఆగస్ట్ 15కు వెళ్లిపోయింది. సినిమాలో ప్రతి సీన్ నచ్చేవరకు డైరెక్టరే కాదు.. హీరో కూడా రాజీ పడడం లేదు.
అందుకే 70 శాతం షూటింగ్ పూర్తయినా.. ఎప్పుడు షూటింగ్ కంప్లీట్ అవుతుందో తెలీక ఇంతవరకు రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయలేదు. అవార్డ్ ఇచ్చిన కిక్‌తో మరింత కాన్సన్‌ట్రేషన్ పెట్టారు. దీంతో తీయాల్సిన పార్ట్‌ను మరింత బెటర్‌మెంట్ కోసం.. లేటైనా పర్వాలేదన్న నిర్ణయంతో సినిమా ఆగస్ట్‌కు వెళ్లిపోయింది. పుష్ప2 మొదట్లో 22 డిసెంబర్‌లో వస్తుందని ప్రచారం జరిగింది. తర్వాత 2024 సమ్మర్‌కు రెడీ చేస్తారని ఊహించారు. పుష్ప డిసెంబర్ 2021లో రిలీజ్ కాగా.. 2022, 2023లో మొహం చాటేసి ఇప్పుడు 2024 ఆగస్ట్‌లో కనిపించనున్నాడు బన్నీ.