రెబల్ స్టార్ ప్రభాస్ నిజంగా అందరికీ షాక్ ఇస్తున్నాడు. అసలు కల్కీ 1200 కోట్లు రాబట్టిన తర్వాత సైలెంట్ అయిన తను, మధ్యలో ఫౌజీ మూవీని లాంచ్ చేశాడు. ది రాజా సాబ్ షూటింగ్ తో బిజీ అయ్యాడు.. అంతవరకే అందరికి క్లారిటీ ఉంది. కాని ఇప్పుడు ఈ రెండు సినిమాల షూటింగ్ ఎక్కడి వరకొచ్చిందో చూస్తే అంతా షాక్ అవ్వాల్సిందే. సైలెంట్ గా ది రాజా సాబ్ ని 95 శాతం పూర్తి చేసిన ప్రభాస్, మిగతా 5 శాతం షూటింగ్ ని వచ్చేనెల 10లోపు పూర్తి చేయబోతున్నాడు. అది కూడా మధ్యలో గ్యాప్ తీసుకుని ఒకషెడ్యూల్ ఫౌజీ షూటింగ్ కి కేటాయించబోతున్నాడు. ఇదే షాకింగ్ న్యూస్ అనుకుంటే, ఇంతకంటే షాక్ తన ఫౌజీ మూవీ ఇస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఏకంగా 25 శాతం పూర్తైంది. ఓ మూవీ షూటింగ్ 25 శాతం పూర్తైందంటే, ఆల్ మోస్ట్ పావు వంతు పూర్తైనట్టే… ఇంత తక్కువ టైంలో అంత పర్సెంటేజ్ షూటింగ్ ని ప్రభాస్ ఎలా పూర్తి చేశాడు…అనుకున్నట్టే జూన్ లోగా ఫౌజీ పూర్తవుతుందా? ఇంతకి ప్రభాస్ స్పీడ్ వెనకున్న రీజనేంటి?
రెబల్ స్టార్ ప్రభాస్ దూకుడు మామూలుగా లేదు. హిట్లతోనే కాదు తన వరుస ప్రాజెక్టులతో ఆల్రెడీ తోటి హీరోలకి షాక్ ఇస్తున్న తను, ఆప్రాజెక్టులని సైలెంట్ గా పూర్తి చేయటంలో కూడా సర్ ప్రైజ్ ఇస్తున్నాడు. అలాంటి షాకే ది రాజా సాబ్, ఫౌజీ మూవీలతో ఇస్తున్నాడు ప్రభాస్
ముగ్గురు హీరోయిన్లు, మూడు పాత్రలు, మూడు ఫ్లాష్ బ్యాక్ లతో తెరకెక్కుతున్న ది రాజా సాబ్ షూటింగ్ 95 శాతం పూర్తైంది. క్లైమాక్స్ ప్యాచ్ వర్క్ తోపాటు రెండు పాటల షూటింగ్ మాత్రమే పెండింది. అది ఈనెల, జనవరి 10 లోగా పూర్తవుతుంది.యూరప్ లో పాటల షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉంది ఫిల్మ్ టీం
ఇక మధ్యలో ఒక షెడ్యూల్ మాత్రం ఫౌజీ కోసం కేటాయించిన ప్రభాస్, ఇంతవరకు ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ లో భాగం కాలేదన్నారు. తను లేని సీన్లే హనురాఘవపూడీ తీస్తున్నాడన్నారు. కాని ప్రభాస్ ఎప్పుడో ఫౌజీ షూటింగ్ లో కూడా జాయిన్ అయ్యాడని తెలుస్తోంది. ఇప్పటికీ మూడు షెడ్యూల్స్ లో జాయిన్ అయ్యి, ఏకంగా 25 శాతం షూటింగ్ పూర్తి చేశాడని తెలుస్తోంది
హను రాఘవపూడీ తెలివిగా ప్రభాస్ లేని సీన్లు ముందుగా తీసి టైం సేవ్ చేస్తే, తర్వాత ప్రభాస్ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. ఏకంగా రొమాంటిక్ టాకీ పార్ట్ ని 10శాతం పూర్తి చేయటంతో ఈ సినిమా మొత్తంగా 25 శాతం షూటింగ్ ని పూర్తి చేసుకుంది
అంటే పావువంతు ఫౌజీ షూటింగ్ పూర్తయినట్టే అని తేలింది. ఇదే వేగం కంటిన్యూ అయితే, జూన్ లోగా ఫౌజీ టాకీ పార్ట్ మొత్తం పూర్తై, పాటల షూటింగ్ మాత్రమే పెండింగ్ ఉండే ఛాన్స్ ఉంది. సో జులై నుంచి స్పిరిట్ కోసం ప్రభాస్ బిజీ అయ్యేందుకు అన్నీ పక్కాగా జరిగిపోతున్నట్టున్నాయి
ఒక సినిమాను పూర్తి చేస్తూ మరో మూవీ షూటింగ్ తో బిజీ అవుతున్న ప్రభాస్అదే సమయంలో మూడో సినిమాను లాంచ్ చేస్తున్నాడు. ఇలా దూకుడు పెంచి షాక్ ఇస్తున్నాడనుకుంటే, అంతే దూకుడుగా షూటింగ్స్ ని పూర్తి చేస్తున్నాడు. అది కూడా ఎలాంటి హంగామా లేకుండా సైలెంట్ గా… ఇది పాన్ ఇండియా లెవల్లో 5 హిట్లు, 5 వేలకోట్లకు మించిన కలెక్షన్లు, హ్యాట్రిక్ సక్సెస్ లు సాధించాక కూడా ఎక్కడా రెబల్ స్టార్ స్పీడ్ తగ్గలేదు. తను రిలాక్స్ మోడ్ లోకి వెళ్లలేదు.