రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు ఎప్పుడు ఏ సినిమా అనౌన్స్ చేస్తాడో అని ఫ్యాన్స్ కూడా ఎక్సైట్ అయిపోతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఎనిమిది సినిమాలు ఉండగా… ఈ ఎనిమిది సినిమాలు మూడు నుంచి నాలుగు ఏళ్లలో రిలీజ్ చేయడానికి ప్రభాస్ ప్లాన్ చేస్తున్నాడు. భారీ బడ్జెట్ సినిమాలైనా సరే ఆరు నుంచి ఏడు నెలలలో ఫినిష్ చేసి రిలీజ్ చేయాలని ప్రభాస్ టార్గెట్ ఫిక్స్ చేసుకున్నాడు. బాహుబలి టైంలో వచ్చిన గ్యాప్ ని ఈ విధంగా కవర్ చేయాలని ప్రభాస్ గట్టి పట్టుదలగా ఉన్నాడు.
అందుకే సినిమా కథ నచ్చిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా నిర్మాణ సంస్థ రెడీగా ఉంటే సినిమాను ఫైనల్ చేసేస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ మారుతి డైరెక్షన్లో అలాగే హనీ రాఘవపూడి డైరెక్షన్లో రెండు సినిమాలు చేస్తున్న ప్రభాస్… ఈ రెండు సినిమాలు ఫినిష్ అయిన తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సలార్ పార్ట్ 2 మొదలుపెట్టే ఛాన్స్ కనబడుతోంది. ఇక రాజాసాబ్ సినిమా షూటింగ్స్ సందర్భంగా ప్రభాస్ గాయపడినట్లు ప్రకటించాడు. అందుకే తాను జపాన్ లో కల్కీ సినిమా ప్రమోషన్ కు కూడా వెళ్లడం లేదని అనౌన్స్ చేసాడు.
సినిమా యూనిట్ అలాగే డిస్ట్రిబ్యూటర్లు సినిమాను ప్రమోట్ చేసుకుంటారని చెప్పుకొచ్చాడు. అయితే ముందు ప్రభాస్ కాలు షూటింగ్ సందర్భంగా బెణికిందని చెప్పారు. అయితే సీన్ రివర్స్ లో ఉందని టాక్. గాయం తీవ్రత పెద్దగా ఉండడంతో ప్రభాస్ కు సర్జరీ కూడా చేస్తున్నారని, ప్రస్తుతం ముంబైలో ప్రభాస్ కు దీనికి సంబంధించిన సర్జరీ చేసే ఛాన్స్ ఉందని జాతీయ మీడియా పేర్కొంది. హైదరాబాద్ లో అయితే మీడియా హడావుడి ఉంటుందని అందుకే ముంబైలో అంటున్నారు జనాలు. దీనితో ప్రభాస్ దాదాపు మూడు నెలల పాటు సినిమా షూటింగ్లకు దూరమయ్యే ఛాన్స్ కనబడుతోంది.
ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తున్న ఈ స్టార్ హీరో ఇలా గాయపడటం సర్జరీ వరకు పరిస్థితి రావడంతో ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే సర్జరీ పెద్దదా చిన్నదాని దానిపై మాత్రం స్పష్టత రావడం లేదు. ఒకవేళ సర్జరీ జరిగితే మాత్రం కచ్చితంగా రెండు నుంచి మూడు నెలల పాటు ప్రభాస్ సినిమాలకు దూరం కావటం ఖాయంగా కనబడుతోంది. వచ్చే ఏడాది మార్చిలో ఒక సినిమా అలాగే దసరా తర్వాత ఒక సినిమాను రిలీజ్ చేయడానికి ప్రభాస్ ప్లాన్ చేసుకున్నాడు. ఇక హోంబలే బ్యానర్ లో కూడా ప్రభాస్ మూడు సినిమాలకు సైన్ చేశాడు. ఇప్పుడు ఆ సినిమాలన్నీ వాయిదా పడే అవకాశం కనబడుతోంది. ముఖ్యంగా సలార్ 2 సినిమా విషయంలోనే ప్రభాస్ ప్లాన్ ఏంటి అనేది అర్థం కావడం లేదు. ఓవైపు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో బిజీగా ఉంటే సలార్ టు షూటింగ్ మొదలైందని అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది.