Rashmika, Kajol : వదల బొమ్మాలి వదల.. అప్పుడు రష్మిక ఇప్పుడు కాజోల్ వంతు..

టెక్నాలజీ కొత్త పుంతలు త్రొక్కుతున్న వేళ దానిని దుర్వినియోగం చేస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. ఇటీవల డీప్ ఫేక్ వీడియోల బెడద ఎక్కువైంది. ఏఐ సాంకేతిక పరిజ్ఞానం విసృతస్థాయిలో అందుబాటులోకి వచ్చాక డీప్ ఫేక్ వీడియోలు రూపొందించడం పెరిగింది.

టెక్నాలజీ (Technology) కొత్త పుంతలు త్రొక్కుతున్న వేళ దానిని దుర్వినియోగం చేస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. ఇటీవల డీప్ ఫేక్ వీడియోల (Deep Fake Video) బెడద ఎక్కువైంది. ఏఐ సాంకేతిక పరిజ్ఞానం విసృతస్థాయిలో అందుబాటులోకి వచ్చాక డీప్ ఫేక్ వీడియోలు రూపొందించడం పెరిగింది. సెలబ్రిటీలను డీప్ ఫేక్ వీడియోలు వదలడం లేదు. ముందుగా రష్మిక మందన్నా దాని బారిన పడగా.. ఇప్పుడు సీనియర్ నటి కాజోల్ వంతు వచ్చింది. ఓ ఇన్ ఫ్లూయెన్సర్ బట్టలు మార్చే వీడియోకు నటి కాజోల్ మొహం మార్చారు. ఆ వీడియోను షేర్ చేయగా వైరల్ అవుతోంది. ఏఐ టెక్నాలజీ ఆధారంగా కాజోల్ ఫేస్ పెట్టినట్టు తెలుస్తోంది. అలా పెట్టిన వారిపై కాజోల్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

ఇది కూడా చదవండి  : LCU అభిమానులకు లోకేశ్ కనగరాజ్ షాక్..

’గెట్‌ రెడీ విత్‌ మీ’ అంటూ ఓ సోషల్‌ మీడియా నటి పోస్ట్‌ చేసిన వీడియోకు కాజోల్‌ ముఖాన్ని ఉపయోగించి ఈ ఫేక్‌ వీడియో సృష్టించారు. దీనిపై పలువురు నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫేక్‌ వీడియోలతో సినీ తారలను టార్గెట్‌ చేయడంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది జూన్‌ నెలలో టిక్‌టాక్‌ వేదికగా ఓ సోషల్‌ మీడియా స్టార్‌ దీనిని పోస్ట్‌ చేశారని, దానిని ఉపయోగించి కాజోల్‌ ఇమేజ్‌కి ఇబ్బంది కలిగించేలా ఈ వీడియో చేశారని మండిపడుతున్నారు. కాజోల్ డీప్ ఫేక్ వీడియో ఎవరు చేశారో తెలియదని బూమ్ నివేదిక చెబుతోంది. మార్చిన వీడియోలో కాసేపు అసలు మహిళ మొహం కనిపిస్తోందని పేర్కొంది.

ఫోటోలు, వీడియోలు, ఆడియోలతో డీప్ ఫేక్ వీడియోలు చేస్తున్నారని.. తర్వాత ఇది పోర్న్ వీడియో సృష్టించేందుకు కూడా దోహదం చేస్తుంది. ఇది సమాజానికి పెను సవాల్‌గా మారింది. రష్మిక మందన్నా ఇష్యూ తర్వాత తప్పుడు కంటెంట్ షేర్ చేయొద్దని.. ఒకవేళ షేర్ చేస్తే వెంటనే తొలగించాలని స్పష్టం చేసింది. వీడియోకు సంబంధించి
ఫిర్యాదు వచ్చిన 36 గంటల్లో కంటెంట్ తీసివేయాలని స్పష్టం చేసింది. ఏఐ, డీప్ ఫేక్ ఉన్న ప్రస్తుత సమయంలో ఆ రూల్స్‌ను పెద్దగా పాటించడం లేదు. అందుకే రష్మిక కేసు విచారణ జరుగుతుండగా.. కాజోల్ డీప్ ఫేక్ వీడియో బయటకు వచ్చింది.