Devara : ఫారిన్‌లో ‘దేవర’

జనతా గ్యారేజ్ కాంబినేషన్ రిపీట్ చేస్తూ.. యంగ్‌ టైగర్ ఎన్టీఆర్‌, కొరటాల శివ చేస్తున్న లేటెస్ట్ సినిమా దేవర.

 

 

జనతా గ్యారేజ్ కాంబినేషన్ రిపీట్ చేస్తూ.. యంగ్‌ టైగర్ ఎన్టీఆర్‌, కొరటాల శివ చేస్తున్న లేటెస్ట్ సినిమా దేవర. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్‌తో పాటు ఆడియెన్స్‌ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత టైగర్ నుంచి వస్తున్న సినిమా ఒకటైతే.. కొరటాలకు ఇది ప్రెస్ట్రీజీయస్ ప్రాజెక్ట్. అందుకే.. దేవర పై అంచనాలు భారీగా ఉన్నాయి.

దసరాకు రావాల్సిన ఈ సినిమా సెప్టెంబర్ 27కి ప్రీపోన్ అయింది. కల్కి తర్వాత టాలీవుడ్ నుంచి వస్తున్న పెద్ద పాన్ ఇండియా సినిమా ఇదే. ఇప్పటికే దేవర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం దేవర 1కి సంబంధించిన కీలక షెడ్యూల్‌ జరుగుతోంది. ఎన్టీఆర్‌, జాన్వీ కపూర్‌, ప్రకాష్ రాజ్‌, షైన్‌ టామ్‌, శ్రీకాంత్‌తో పాటు కీలక నటీనటులు ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నట్టుగా తెలుస్తోంది.

ఇక ఈ షెడ్యూల్‌ పూర్తి చేసిన తర్వాత ఎన్టీఆర్‌, జాన్వీ కపూర్‌లపై ఫారిన్‌లో ఓ పాట షూటింగ్‌కు ప్లాన్ చేస్తున్నారట. ఇక్కడితో దేవర పార్ట్‌ 1 షూటింగ్‌ కంప్లీట్ కానుందని సమాచారం. జులై నెలలో షూటింగ్‌ పూర్తి చేయాలని అనుకున్నప్పటికీ.. ఆగస్టు మొదటి లేదా రెండో వారానికి దేవర షూటింగ్‌ పూర్తి కానుందని అంటున్నారు. ఇక ఈ సినిమా అయిపోగానే.. వెంటనే వార్ 2లో జాయిన్ అవనున్నాడు ఎన్టీఆర్. ఇప్పటికే వార్2లో హృతిక్ రోషన్‌తో కలిసి కీలక షెడ్యూల్ పూర్తి చేశాడు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా పై ఫోకస్ చేయనున్నాడు. ఈ లోపు నీల్ ‘సలార్ 2’ కంప్లీట్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఏదేమైనా.. దేవర పై అంచనాలు మాత్రం గట్టిగా ఉన్నాయి.