Rihanna; బిలియనీర్లు, బిజినెస్ దిగ్గజాల ఇంట్లో పెళ్లి అంటే ఆ సందడి మామూలుగా ఉండదు. సినిమాల్లో చెప్పినట్లు, కవితల్లో వర్ణించినట్లు ఆకాశమంత పందిరి, భూదేవి అంత అరుగు వేసి అంగరంగ వైభవంగా చేస్తారు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్అంబానీ-రాధిక మర్చంట్ ప్రి మ్యారేజ్ వేడుక ఇప్పుడు అదే రేంజ్లో జరిగింది. జామ్‌నగర్‌లోని రిలయన్స్ గ్రీన్స్‌లో అనంత్ అంబానీ-రాధిక వెడ్డింగ్ వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి.
GAAMI VS BHIMA: గామి వర్సెస్ భీమా.. ఏది హిట్టు..?
ముఖేష్ అంబానీ వారసుడి పెళ్లి సందడి అంబరాన్ని తాకింది. దేశ, విదేశాల నుంచి ఈ పెళ్లికి టాప్ సెలబ్రిటీలు అటెండ్ అయ్యారు. ప్రీవెడ్డింగ్‌కి కేవలం ఒక రోజు ముందే బాలీవుడ్ సెలబ్రిటీలు, గ్లోబల్ స్టార్స్ సహా పలువురు అతిథులు జామ్‌నగర్‌కు వెళ్లి సందడి చేశారు. ఇక.. వరల్డ్ వైడ్‌గా మాట్లాడుకునే రేంజ్లో జరిగిన ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకల కోసం పాప్ స్టార్ రిహన్న బృందం కూడా వచ్చింది. ఈ వేడుకలో ఆమె తన టీమ్‌తో సహా ప్రత్యేకంగా ప్రదర్శన ఇచ్చింది. అయితే దీనికోసం అంబానీ ఫ్యామిలీ రిహన్నా అండ్ టీమ్‌కు ఆఫర్ చేసిన రెమ్యూనరేషన్ ఇప్పుడు హాట్ న్యూస్‌గా మారింది. ఈ ఈవెంట్ కోసం అంబానీ కుటుంబం రిహన్నాకు అక్షరాలా 70కోట్ల రెమ్యూనరేషన్ చెల్లించిందట. ఈ న్యూస్ విని నెటిజన్లు నోళ్లు వెళ్లబెడుతున్నారు. కుబేరుడు అంబానీ ఇంట్లో పెళ్లంటే మామూలుగా ఉంటుందా అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ సంవత్సరం అతిపెద్ద వివాహాలలో ఒకటిగా అనంత్ అంబానీ – రాధిక మర్చంట్ వివాహం హెడ్‌లైన్స్‌లో నిలుస్తోంది.
అనంత్ అంబానీ వివాహాన్ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసేందుకు ఇప్పటి నుంచే అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. జులై 1వ తేదీన అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహం జరగనుంది. అయితే.. మార్చి 1 నుంచి మార్చి 3వ తేదీ వరకు జరిగిన ప్రీ వెడ్డింగ్ వేడుకలు సెన్సేషన్‌గా మారాయి. మూడు రోజుల పాటు జరిగిన ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పటికీ హల్చల్ చేస్తున్నాయి. ప్రీ వెడ్డింగ్ వేడుకలనే ఇంత గ్రాండ్‌గా జరిపిన అంబానీ ఫ్యామిలీ.. వివాహ వేడుకలను నెవర్ బిఫోర్ అన్న రేంజ్లో చేయడం ఖాయమంటున్నారు.