Rihanna: రెమ్యునరేషన్‌లో ఖాన్స్‌ను మించేసిన రిహన్నా!

ఇక ఇదే ఈవెంట్‌లో ప్రత్యేకంగా షో ఇచ్చేందుకు ఇంటర్నేషనల్‌ పాప్‌ సింగర్‌ రిహన్నాను పిలిపించారు అంబానీ. ఇందుకోసం రిహాన్నాకు భారీ మొత్తంలో రెమ్యునరేషన్‌ కూడా చెల్లించినట్టు తెలుస్తోంది.

  • Written By:
  • Publish Date - March 4, 2024 / 04:57 PM IST

Rihanna: మిలియనీర్స్‌ ఇళ్లలో ఈవెంట్స్‌ అంటే మామూలుగా ఉండదు. అందులోనూ అంబానీ ఇంట్లో ఈవెంట్‌ అంటే ఇక నెక్స్ట్‌ లెవెల్‌. సినిమాల్లో చెప్పిన‌ట్లు, క‌విత‌ల్లో వ‌ర్ణించిన‌ట్లు ఆకాశ‌మంత పందిరి, భూదేవి అంత అరుగు వేసి అంగ‌రంగ వైభ‌వంగా కొడుకు అనంత్‌ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేట్‌ చేశారు ముకేష్‌ అంబానీ. జామ్‌నగర్‌లోని రిలయన్స్ గ్రీన్స్‌లో అనంత్ అంబానీ-రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుక జరిగింది. ఈ ఈవెంట్‌కు సినీ స్టార్స్‌తో పాటు.. జాతీయ అంతర్జాతీయ వ్యాపారవేత్తలు తరలివచ్చారు.

Anant Ambani: అనంత్ అంబానీ ప్రి వెడ్డింగ్ ఫంక్షన్‌లో మెరిసిన తారలు.. లేటెస్ట్ ఫొటోస్

సొంత ఇంట్లో ఈవెంట్‌ అన్న మాదిరిగా ఎంజాయ్‌ చేశారు. ఇక ఇదే ఈవెంట్‌లో ప్రత్యేకంగా షో ఇచ్చేందుకు ఇంటర్నేషనల్‌ పాప్‌ సింగర్‌ రిహన్నాను పిలిపించారు అంబానీ. ఇందుకోసం రిహాన్నాకు భారీ మొత్తంలో రెమ్యునరేషన్‌ కూడా చెల్లించినట్టు తెలుస్తోంది. తన టీంతో సహా ఇండియాకు వచ్చిన రిహన్నా.. అనంత్‌ ప్రీ వెడ్డింగ్‌ ఈవెంట్‌లో ఆడిపాడింది. బాలీవుడ్‌ స్టార్స్‌తో కలిసి స్టెప్పులు కూడా వేసింది. అయితే ఇక్కడ మేటర్‌ రిహన్నా గురించి కాదు. ఇదే ఈవెంట్‌కు బాలీవుడ్‌ కింగ్‌ పీసెస్‌.. అమీర్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌, షారుఖ్‌ ఖాన్‌ కూడా వచ్చారు. ముగ్గురూ కలిసి డాన్స్‌ పర్ఫార్మెన్స్‌ కూడా ఇచ్చారు. ఈ ముగ్గురిని ఒకే స్క్రీన్‌ మీద చూడిలి అనుకునే ఫ్యాన్స్‌ ఆశ.. ఈ ఈవెంట్‌తో తీరిపోయింది. ఇక్కడ ఇంట్రెస్టింగ్‌ పాయింట్‌ ఏంటి అంటే.. పర్ఫార్మెన్స్‌ ఇచ్చేందుకు ఈ ముగ్గురు ఖాన్స్‌కు ఇచ్చిన రెమ్యునరేషన్‌ రిహన్నాకు ఇచ్చిన రెమ్యునరేషన్‌ కంటే తక్కువ అని ఇంటర్నెట్‌లో చర్చ జరుగుతోంది.

అనంత్‌ ప్రీ వెడ్డింగ్‌ ఆడిపాడేందుకు రిహాన్నా దాదాపు 9 మిలియన్‌ డాలర్స్‌ చార్జ్‌ చేసింది. అంటే మన కరెన్సీలో దాదాపు 70 కోట్లు. కానీ ముగ్గురు ఖాన్స్‌ ఈ పర్ఫార్మెన్స్‌ ఇచ్చేందుకు మాత్రం ఇంత రెమ్యునరేషన్‌ చార్జ్‌ చేయలేదని టాక్‌. ఈ లెక్కన చూస్తే.. బాలీవుడ్‌ కింగ్‌ ఖాన్స్‌ కంటే కూడా రిహన్నా ఎక్కువే చార్జ్‌ చేసినట్టు తెలుస్తోంది.