Robert Downey Jr: ఐరన్ మ్యాన్ కష్టాలకు.. ఆస్కార్ కన్నీళ్లు..

అతడికి షెర్లాక్ హోమ్స్‌కి మిస్ అయిన ఆస్కార్, ఇప్పుడు ఇలా దక్కింది. ఐరన్ మ్యాన్‌గా వరల్డ్ ఆడియన్స్‌కి దగ్గరయ్యాడు రాబర్ట్. ఇండియాలో అతడికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తనకే కాదు ఇలా ఇండియన్స్‌లో భారీ ఫాలోయింగ్ ఉన్న వాళ్లకే ఈ సారి ఆస్కార్ దక్కింది.

  • Written By:
  • Publish Date - March 11, 2024 / 05:59 PM IST

Robert Downey Jr: నటుడికైనా, టెక్నీషియన్‌కైనా.. ఆస్కార్ అవార్డ్ ఎవరికైనా ఓ కలే. విచిత్రం ఏంటంటే కొన్ని సార్లు ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత బాగా పెర్ఫామ్ చేసినా నటులకే కాదు, టెక్నీషియన్స్‌కి కూడా ఆస్కార్ అందని ద్రాక్ష అవుతూ ఉంటుంది. అలా కొన్నేళ్లుగా ఐరన్ మ్యాన్ రాబర్ట్ డౌనీ జూనియర్‌ని ఆస్కార్ దూరం పెట్టింది. కట్ చేస్తే ఓపెన్ హైమర్‌లో విలన్‌గా కనిపించిన తను, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్‌గా ఆస్కార్ అవార్డు అందుకున్నాడు.

Raghu Rama Krishna Raju: రఘురామకు బీజేపీ ఝలక్‌.. ప్రభాస్ ఫ్యామిలీకే నరసాపురం టికెట్‌!

అతడికి షెర్లాక్ హోమ్స్‌కి మిస్ అయిన ఆస్కార్, ఇప్పుడు ఇలా దక్కింది. ఐరన్ మ్యాన్‌గా వరల్డ్ ఆడియన్స్‌కి దగ్గరయ్యాడు రాబర్ట్. ఇండియాలో అతడికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తనకే కాకుండా ఇలా ఇండియన్స్‌లో భారీ ఫాలోయింగ్ ఉన్న వాళ్లకే ఈ సారి ఆస్కార్ దక్కింది. అందుకే దక్కిందనే లాజిక్ లేని లాజిక్ అనుకోలేం కాని, ఇండియన్స్ ఎక్కువ సంతోషపడే పరిస్థితులొచ్చాయి. క్రిస్టోఫర్ నోలాన్ ఎంత బ్రిటీషరే అయినా, తనకి ఇండియా అన్నా, ఇండియన్స్ అన్నా చాలా ప్రేమ. తన ప్రతీ మూవీలో ఇండియన్స్ కి మంచి స్థానం దక్కుతుంది. ఇండియా గురించి తన వివరణ గొప్పగా ఉంటుంది. అలాంటి తనకి ఓపెన్ హైమర్ పుణ్యమాని బెస్డ్ డైరెక్టర్ గా అవార్డ్ దక్కింది.

బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ సినిమాటోగ్రఫి, బెస్ట్ ఎడిటింగ్, బెస్ట్ ఒరిజినల్ స్కోర్, ఇక బెస్ట్ యాక్టర్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్.. ఇలా ఏకంగా ఏడు క్యాటగిరీల్లో అవార్డ్ రావటంతో వాళ్ల బంధువులకంటే, ఇండియన్సే ఎక్కువ సంతోషపడుతున్నారు. సోషల్ మీడియాలో ఎన్నడూ లేనంతగా, ఏ ఏడాది కనిపించనంతగా, మన ఇండియన్స్ మీమ్స్ తో విష్ చేయటం హాట్ టాపిక్ గా మారింది. దీనికితోడు త్రిబుల్ ఆర్ విజువల్స్ కూడా ఆస్కార్ స్టేజ్ మీద మళ్ళీ మెరవటం కూడా షాకింగ్ గానే మారింది.