Rocking Rakesh: జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బుల్లితెరపై తనదైన క్లీన్ కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇక చిన్నపిల్లలతో స్కిట్స్ చేపిస్తూ ఎంతో మంచి పేరు సంపాదించుకున్నాడు. కేవలం షోలకే పరిమితం కాకుండా సినిమాల్లో కూడా నటిస్తూ వెండితెరపై కూడా తనదైన ముద్ర వేసుకున్నాడు. ఈ క్రమంలో రాకేష్ ప్రొడ్యూసర్‌గా కేసీఆర్ అనే టైటిల్‌తో ఓ సినిమా తెరకెక్కించాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి ఎలక్షన్ కమిషన్ నుంచి భారీ షాక్ తగిలింది.
Prabhas: ఇంద్ర భవనంలాంటి ఇల్లు.. ప్రభాస్ కొత్త ఇంటి నిర్మాణం ఖరీదు అన్ని కోట్లా..!
ఈ సినిమా విడుదలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో రాకేష్ ఇన్‌స్టా వేదికగా తన అభిమానులతో విషయాన్ని పంచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. రాకేష్ ప్రముఖ యాంకర్ సుజాతను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. తరువాత ఇద్దరు కలిసి షోలు చేశారు. ప్రస్తుతం సినిమాను నిర్మాణంలో బిజీగా ఉన్నాడు రాకేష్. కేసీఆర్ సినిమా కోసం తన ఇంటిని కూడా తాకట్టు పెట్టానని గతంలో చెప్పాడు. ఇక చిత్రం విడుదల అయితే మంచి పేరు వస్తుందని భావించాడు. తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికలు జరుగుతున్న వేళ ఎన్నికల కమిషన్ కొన్ని సినిమాలకు నిబంధనలు తీసుకొచ్చింది. ఓటర్లను ప్రేరేపించే సినిమాల విడుదలను నిలిపివేసింది. దీనిలో భాగంగా నవంబర్ 17 లేదా 24న విడుదల చేద్దాం అనుకున్న కేసీఆర్ చిత్రాన్ని కూడా రిలీజ్ చేయొద్దు అని ఆర్డర్స్ ఇచ్చింది. ఇదే విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో చెబుతూ భావోద్వేగానికి లోనయ్యడు. “మనం ఒకటి తలిస్తే.. దైవం ఒకటి తలిచినట్లు..
అనుకున్న టైంకి.. అంటే ఈ టైంకు సినిమా రిలీజ్ చేద్దామని పక్కా ప్లాన్ చేసుకున్నాం. నా వెనకాల ఉండి చాలా మంది నన్ను ముందుకు నడిపారు. నా మూవీ గురించి ఓ బిగ్ న్యూస్ అండ్.. బ్రేకింగ్ న్యూస్.. సినిమాను ఆపేస్తూ ఈసీ ఆర్డర్స్ ఇచ్చింది. మొత్తానికే ఇలా ఉంటుందని తెలీదు. ఏది జరిగినా మన మంచికే.. బ్యాడ్ అనుకోను. గుడ్ అనుకుంటాను. పబ్లిసిటీ చేసుకోవటానికి టైం దొరికింది అనుకుంటా. మీ అందరి సహాయ సహకారాలు నాకు కావాలి” అంటూ ఎమోషనల్ అయ్యారు. దీనిపై నెటిజన్లు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. మంచి సినిమాను జనాలు ఎప్పుడైనా ఆధారిస్తారని రాకేష్‌కు మద్దతుగా నిలుస్తున్నారు