బిగ్ బాస్ హౌస్ (Bigg Boss 7) రొమాంటిక్ హౌస్ (Romantic House) గా మారి పోయింది. ఫ్యామిలీ వీక్ లో భాగంగా.. ఇల్లు మొత్తం ఎమోషన్ తో నిండిపోయింది. అయిన వారి రాక ఇంటి సభ్యుల్లో కొత్త జోష్ ను నింపుతోంది. బుదవారం శివాజీ కొడుకు, అర్జున్ వైఫ్, అశ్విని అమ్మ రాకతో.. ఇల్లు మొత్తం సంతోషంతో నిండిపోయింది. అంతేకాక అతిథులు ఇచ్చిన రివ్యూలు ఆట కొత్త మలుపు తిరిగే ప్లాన్ చేశాడు బిగ్ బాస్. గురువారం ప్రియాంక ప్రియుడు, గౌతమ్ అమ్మ భోలే భార్య హౌస్ లో అడుగు పెట్టారు.
ఇంటి సభ్యుల సరదా మాటలతో బిజీగా ఉన్న టైం లో కన్నయ్య కన్నయ్య అంటూ గౌతమ్ అమ్మ పిలుపు వినిపించింది. దీంతో తల్లి కోసం గౌతమ్ తెగ పరితపించాడు. అమ్మ ఇంట్లో అడుగుపెట్టగానే.. సంతోషంతో హగ్ చేసుకుని కన్నీరు పెట్టుకున్నాడు. అనంతరం గౌతమ్ వాళ్ల అమ్మతో ఇంటిసభ్యులు కబుర్లు చెప్పగా.. వారి ఆటతీరును చెప్పుకుంటూ వచ్చారు, ఇక అమ్మచేతి గోరు ముద్దుల రుచి చూశారు ఇంటిసభ్యులు. గౌతమ్ వాళ్ల అమ్మను చూసి యావర్ కన్నీరు పెట్టుకోగా.. నువ్వు కూడా కొడుకు లాంటి వాడివే అంటూ దగ్గర కు తీసుకుంది. ఇక గౌతమ్ వాళ్ల అమ్మ ఇంటి నుంచి వెళ్లిపోయింది. కట్ చేస్తే.. అమ్మ ఇచ్చిన రివ్యూతో గౌతమ్ తన గేమ్ ను ఛేంజ్ చేసుకోవాలని అనుకున్నాడు
ఇక ప్రియాంక ప్రియుడు శివకుమార్.. రోజా పువ్వు పట్టుకుని ఇంట్లోకి ఎంటర్ అయ్యాడు. శివను చూడగానే.. ప్రియాంక తెగ సిగ్గు పడిపోయింది. శివ ప్రియాంక ని చూసి హగ్ చేసుకోవడంతో పాటు ముద్దుల వర్షం కురిపించాడు. గేమ్ చాలా బాగా ఆడుతున్నావు.. నీ గేమ్ నువ్వు ఆడాలని సూచించాడు. అంతేకాక ఇంటి సభ్యుల ఆట తీరు గురించి చెప్పాడు. శివ ను పెళ్లి ఎప్పుడు చేసుకుందామని… ప్రియాంక అడగ్గా.. బయటకు రాగానే చేసుకుందామని అన్సర్ ఇచ్చాడు. ఈ లవ్ బర్డ్ మధ్య జరిగిన కెమిస్ట్రీ ఎపిసోడ్ కే హైలెట్ గా నిలించింది.
ఇక హౌస్ లోకి బోలే భార్య కూడా వచ్చింది. భార్య రాకతో సంతోష పడ్డ బోలే.. ఆమె కోసం కొన్ని పాటలు పాడాడు. భర్త పాట బాగుందని.. కోపం తగ్గించుకోవాలి సలహా ఇచ్చింది. ఇక హౌస్ లో అందరూ బాగా ఆడుతున్నారని.. అందరికి తనదైన స్టైల్ లో రివ్యూ ఇచ్చింది. మొత్తానికి బిగ్ బాస్ హౌస్ అతిథుల రాకతో కలర్ ఫుల్ గా మారడంతో పాటు ఎమోషనల్ గా మారిపోయింది.