తెలుగోడి సత్తాను, తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసింది. ట్రిపుల్ఆర్ గురించి ఎంత మాట్లాడుకున్నారో.. చాట్‌జీపీటీ గురించి అంతే మాట్లాడుకున్నారు జనాలు ! ఐతే చాట్‌జీపీటీని ట్రిపుల్ఆర్ గురించి అడిగితే ఆసక్తికర విషయాలు బయటపెట్టింది. ఆ మూవీని హిందీలో రీమేక్ చేస్తే.. యాక్టర్స్ ఎవరు బాగుంటారు చాట్‌జీపీటీ అంటే.. చిలుకపలుకులు పలుకుతూ చెప్పిన మాటలు.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్.
రామ్‌చరణ్ పాత్రలో రణ్వీర్ సింగ్ లేదా సిద్ధార్థ్ మల్హోత్రా.. ఎన్టీఆర్ భీమ్ రోల్‌కు విక్కీ కౌషల్ లేదా రాజ్‌కుమార్ అయితే బెటర్ అంటూ సజెస్ట్ చేసింది. ట్రిపుల్‌ఆర్‌లో మరో ఇంపార్టెంట్ పాత్ర సీత. ఆలియా ప్లే చేసిన ఈ కేరక్టర్లో.. శ్రద్ధాకపూర్ లేదంటే కృతిసనన్ పర్ఫెక్ట్ చాయిస్ అంటూ చెప్పేసింది చాట్‌జీపీటీ. ఇక మిగిలిన రోల్స్ విషయానికి వస్తే.. అజయ్దేవ్గన్కి రిప్లేస్‌మెంట్‌గా సంజయ్‌దత్ లేదా అనిల్‌కపూర్… శ్రియ రోల్‌కి దీపికా పదుకొణె బాగుటుందని సజెస్ట్ చేసింది. ఇక రీమేక్‌కు డైరెక్టర్ ఎవరు అన్న దానికి మైండ్‌బ్లోయింగ్ ఆన్సర్ ఇచ్చింది చాట్‌జీపీటీ. సంజయ్‌లీలా బన్సాలీ.. ట్రిపుల్ఆర్ను రీమేక్ చేస్తే అదిరిపోతుందంటూ చెప్పింది. చాట్‌జీపీటీ జోస్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.