రీసెంట్ గా ప్రియాంకా చోప్రా త్రిబుల్ ఆర్ మూవీని తమిల్ మూవీ అనటంతో, నెటీజన్స్ ఫైర్ అవటం మొదలైంది. కాని ఈ అవమానాల పరంపర ఇప్పటిది కాదు.. ఆస్కార్ వేదిక మీద కూడా వ్యాఖ్యాత జిమ్మీ కెమాల్ కూడా త్రిబుల్ ఆర్ ని బాలీవుడ్ మూవీనేఅన్నాడు. అలా కష్టపడేది మనోళ్లే పేరు మాత్రం బాలీవుడ్ ఎకౌంట్లో పడుతోంది. సరే సని సరిపెట్టుకుంటే, బాలీవుడ్ వాళ్లు కూడా మనోళ్ల కష్టాన్ని కోలీవుడ్ కిచ్చేస్తున్నారు. తెలుగు సినిమాను తమిళ్ మూవీ అంటూ అగ్నానంతో వాగేస్తున్నారు
ఒకప్పుడు సౌత్ సినిమా అనేవాళ్లని, తెలుగు సినిమా ప్రత్యేకమని బాహుబలితో ప్రూవ్ చేశాడు రాజమౌళి. దీంతో తెలుగు,తమిల్, మలయాళ ఫిల్మ ఇండస్ట్రీలు వేరు వేరని నార్త్ జనానికి అర్ధమైంది. త్రిబుల్ ఆర్ తో లెక్క మారింది. ఇప్పుడు ఓరకంగా కన్నడ కేజీయఫ్, కాంతారా మూవీలు తెలుగు సినిమాలంటూ కన్నడ సినిమాల క్రెడిట్ మన ఎకౌంట్లో వేస్తున్నారు. ఇది బాలీవుడ్, హాలీవుడ్ లో సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీల మీద అవగాహన లేక చేసే వ్యాఖ్యలు..