RRR: రాజమౌళి ఏం స్కెచ్చేశాడు.. మళ్లీ ఆస్కార్ వేదిక మీద ఆర్ఆర్ఆర్..

ఆస్కార్ అవార్డులు ఎనౌన్స్ చేసే ముందు గొప్ప సినిమాల్లోని విజువల్స్ ప్లే అయ్యాయి. వాటిలో త్రిబుల్ ఆర్‌లోని నాటు నాటు సాంగ్ విజువల్స్ ప్లే అయ్యాయి. అలాగే స్టంట్‌మేన్‌ల గొప్పతనం గురించి చెప్పే వీడియోలో కూడా చాలా హాలీవుడ్ మూవీస్‌తో పాటు త్రిబుల్ ఆర్ మూవీ వీడియోస్ ప్లే అయ్యాయి.

  • Written By:
  • Publish Date - March 11, 2024 / 05:24 PM IST

RRR: త్రిబుల్ ఆర్ విజువల్స్ మళ్లీ ఓ సారి ఆస్కార్ వేదిక మీద మెరవగానే ప్రతీ భారతీయుడు గర్వ పడ్డాడు. అదేంటి.. లాస్ట్ ఇయరే కదా త్రిబుల్ ఆర్‌కి ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ దక్కింది. మళ్లీ ఈ ఏడాది మన సినిమా తాలూకు సందడి అక్కడెందుకనే డౌటే అందరికి వచ్చింది. ఐతే ఆస్కార్ అవార్డులు ఎనౌన్స్ చేసే ముందు వచ్చే విజువల్స్‌లో గొప్ప సినిమాల్లోని విజువల్స్ ప్లే అయ్యాయి. వాటిలో త్రిబుల్ ఆర్‌లోని నాటు నాటు సాంగ్ విజువల్స్ ప్లే అయ్యాయి.

Samantha : తన అందాలతో యువతను కట్టిపడేస్తున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత..

అలాగే స్టంట్‌మేన్‌ల గొప్పతనం గురించి చెప్పే వీడియోలో కూడా చాలా హాలీవుడ్ మూవీస్‌తో పాటు త్రిబుల్ ఆర్ మూవీ వీడియోస్ ప్లే అయ్యాయి. ఇదే అసలు విచిత్రం. చాలా ముఖ్యమైన అవార్డుల వేడుక ఇది. అందులోనూ రెండు కేటగిరీల తాలూకు ఆస్కార్ టీం రెడీ చేసినా ఆడియో, వీడియో టీజర్లలో త్రిబుల్ ఆర్ వీడియోస్ ఉండటం అంటే మామూలు విషయం కాదు. ఇదేదో ఇండియన్ ఆడియన్స్‌ని ఎట్రాక్ట్ చేసేందుకు ఆస్కార్ టీం చేసిన పనేనా అంటే, అది కూడా అయ్యుండొచ్చు. కాని, రాజమౌళితోపాటు తన కొడుకు కార్తికేయ ఈ మొత్తం సీన్ వెనకున్నారని తెలుస్తోంది.

హాలీవుడ్ మార్కెట్లో జెండా పాతేందుకు మహేశ్‌తో మూవీ తీయబోతున్న రాజమౌళి, నెట్‌ఫ్లిక్స్, డ్రీమ్ వర్క్స్, యూనివర్సల్ పిక్చర్స్ లాంటి హాలీవుడ్ సంస్థలతో టై అప్ అయ్యాడు. వాళ్లు ఇచ్చిన సహకారం వల్లే ఇలా మరోసారి త్రిబుల్ ఆర్ వీడియోలు ఆస్కార్ వేదిక మీద రెండు సందర్భాల్లో మెరిశాయి. మన మూవీకి భారీ మైలేజ్ రావటానికి కారణమయ్యాయి.