ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ మొదలు పెట్టిన సినిమా డ్రాగన్. ఫిబ్రవరి నుంచి ఈ సినిమా షూటింగ్ లో మ్యాన్ ఆఫ్ మాసెస్ జాయిన్ కాబోతున్నాడు. వచ్చీ రాగానే ఫస్ట్ సాంగ్ షూటింగ్ తో ప్రశాంత్ నీల్ షాక్ ఇవ్వబోతున్నాడు. అయితే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో జోడీ కట్టాలంటే హీరోయిన్ కూడా వుమెన్ ఆఫ్ మాసెస్ అనిపించుకోవాల్సిందే. లేదంటే దేవరలో ఎన్టీఆర్ పక్కన జాన్వీ తేలిపోయినట్టే సీన్ మారిపోతుంది. అందుకే ఈ సారి ఏరి కోరి, మ్యాన్ ఆఫ్ మాసెస్ కి తగ్గ సాలిడ్ కటౌట్ ని దేశం బయటే వెతుకుతున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. విచిత్రం ఏంటంటే రజినీ కాంత్ తర్వాత జపాన్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న సౌత్ హీరోల్లో ఎన్టీఆర్ క్రేజే వేరు. కాకపోతే తన సినిమాలో జపనీస్ కాకుండా మలేసియా బ్యూటీకే డ్యూటీ దక్కుతోంది. ఎందుకు? మరి ఆల్రెడీ వినిపస్తున్న లోకల్ లేడీ పరిస్థితేంటి?
డ్రాగన్ షూటింగ్ సైలెంట్ గా జరుగుతోంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ లేకుండానే తను లేని సీన్ల వరకు షూటింగ్ పూర్తి చేస్తున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. వార్ 2 షూటింగ్ తో ఎన్టీఆర్ బిజీ అవ్వటం వల్లే ఇలా ఈ టైంని సేవ్ చేస్తున్నాడు దర్శకుడు. అంతవరకు బానే ఉంది. కాకపోతే ఫిబ్రవరి నుంచే సెట్లోని ఎన్టీఆర్ కన్ఫామ్ అయ్యింది. సో అప్పటి నుంచే హీరోయిన్ తో సీన్లు, సాంగ్ ని షూటింగ్ చేసేందుకు షెడ్యూల్ ప్లాన్ చేశాడు ప్రశాంత్ నీల్
మరి ఎన్టీఆర్ తో కలిసి చిందేసే లేడీ ఎవరనే ప్రశ్న ఆటోమేటిగ్గా వస్తుంది.. ఆల్రెడీ తన హీరోయిన్ గా లేడీ డ్రాగన్ ఈమే అంటూ రుక్మినీ వసంత పేరు వినిపించింది. కాని కన్నడ మూవీ బఘీరా ఫేం అయిన రుక్మిణీ, అసలు తనకి డ్రాగన్ లో ఆఫర్ వస్తే ఎగిరి గంతేస్తా కాని, కామ్ గా ఎందుకుంటానని తేల్చింది..
అలా అయితే డ్రాగన్ కోసం గ్లామర్ దాడి చేసే లేడీ డ్రాగన్ ఎవరూ అనే ప్రశ్నకు సమాధానం మలేషియాలో దొరుకుతోంది. బేసిగ్గా సౌత్ ని మించేలా నార్త్ ఇండియాలో ఎన్టీఆర్ కి మాస్ ఫ్యాన్ బేస్ బలంగా ఉంది. జపాన్ లో కూడా రజినీకాంత్, ప్రభాస్ ని మించేలా ఎన్టీఆర్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.
కాబట్టి దేశం అవతల ఎన్టీఆర్ కోసం హీరోయిన్లు క్యూ అనగానే జపనీస్ లేడీని లేడీ డ్రాగన్ గా రంగంలోకి దింపుతారనే ప్రచారం జరిగింది. కాని మలేషియన్ లేడీ డ్రాగనే కన్ఫామ్ అయ్యేలా ఉంది. ఎందుకంటే డిసెంబర్ 15న అక్కడ 150 మంది మలేషియన్ మోడల్స్ ని డ్రాగన్ మూవీకోసం అడీషన్ చేయబోతున్నాడట.
మలేషియాలో కూడా ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ బాగా దూసుకెళ్లటం, దేవర ఇంగ్లీష్ వర్షన్ కి మలేషియా ఓటీటీలో రెస్పాన్స్ అదరటం కూడా ఓ కారణం కావొచ్చు. లేదంటే జపాన్, కొరియాతో పాటు మలేషియన్ మార్కెట్ ని డ్రాగన్ టీం టార్గెట్ చేసి ఉండొచ్చంటున్నారు. ఇక కంటెంట్ కూడా జపనీస్, కొరియన్లు, ఇండోనేషియా, మలేషియన్లకు లింక్ ఉండటం వల్లే టైటిల్ ని డ్రాగన్ గా ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. కాబట్టే హీరోయిన్ గా మలేషియా లేడీని కన్ఫామ్ చేసే పనిలో పడింది ప్రశాంత్ నీల్ టీం. సో త్వరలోనే ఎన్టీఆర్ మూవీ కేవలం ఇండియా తోపాటు ఇంగ్లీష్ కొరియన్, స్పానిష్ లోనే కాదు మలేషియా భాషలో కూడా రీసౌండ్ చేయటం ఆల్ మోస్ట్ కన్ఫామ్ అయ్యింది.