దేవర సినిమా ఎన్టీఆర్ కు చాలా నేర్పింది, ఇప్పటి వరకు ఏ సినిమాకు చూడని పరిస్థితి దేవరకు చూసాడు ఎన్టీఆర్. అగ్ర హీరోల్లో ఎవరికి ఈ తరహా పరిస్థితి ఎదురు కాలేదనే మాట వాస్తవం. దాదాపు నలుగురు అగ్ర హీరోల ఫ్యాన్స్ ఎన్టీఆర్ ను టార్గెట్ చేసారు. ఒకటి కాదు రెండు కొన్ని వందల మీమ్స్ పేజెస్ ఎన్టీఆర్ సినిమాను ట్రోల్ చేసాయి అనే విషయం తెలిసిందే. ఇక ఎన్టీఆర్ ఇప్పుడు తెలుగులో ఉన్న పరిస్థితి చూసి విరక్తి చెందినట్టు తెలుస్తోంది. తెలుగు డైరెక్టర్ లతో కూడా సినిమాలు చేయడానికి ఎన్టీఆర్ సిద్దంగా లేడు అని సమాచారం.
ఇప్పటికే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా మొదలుపెట్టాడు. దేవర విడుదలకు ముందే ఆ సినిమా షూటింగ్ కి వెళ్ళాడు ఎన్టీఆర్. ఇక ఈ సినిమా తర్వాత వెట్రిమారన్ తో ఒక సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. వెట్రిమారన్ ఇప్పటికే కథ కూడా సిద్దం చేసినట్టు వార్తలు వస్తున్నాయి. వచ్చే ఏడాది ఈ సినిమాను మొదలుపెట్టే సూచనలు ఉన్నాయి. ఈ మధ్యలో వార్ 2 సినిమాను కూడా ఎన్టీఆర్ పూర్తి చేసే ఆలోచనలో ఉన్నాడు. ఇతర భాషల్లో ఎన్టీఆర్ కు ఎలాగూ ఫాలోయింగ్ పెరుగుతోంది. కన్నడలో కాంతారా ప్రీక్వెల్ లో నటిస్తే ఎన్టీఆర్ కు కచ్చితంగా ఫ్యాన్ బేస్ ఏర్పడుతుంది.
అందుకే ఇతర భాషల మీదనే ఎన్టీఆర్ ఎక్కువగా దృష్టి పెడుతున్నాడు. దేవర తెలుగు ప్రమోషన్ ల కంటే ఇతర భాషలకే ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఇప్పుడు ప్రశాంత్ నీల్ సినిమాలో హీరోయిన్ కూడా కన్నడ అమ్మాయినే సెలెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా రుక్మిణీ వసంత్ ను ఎంపిక చేసినట్టు సమాచారం. సప్త సాగరాలు ధాటి అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఆమె పరిచయం అయ్యారు. ఇలా ఎన్టీఆర్ తెలుగు కంటే కన్నడకె ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం హాట్ టాపిక్ గా మారుతోంది. మరి భవిష్యత్తులో ఎన్టీఆర్ ప్లాన్స్ ఎలా ఉంటాయో చూడాలి.