Adipurush: ఆదిపురుష్‌ బ్యాన్ చేయాల్సిందే.. అయోధ్యలో సాధువుల ఆగ్రహం

ఏ ముహూర్తాన రిలీజ్ అయిదో కానీ.. ఆదిపురుష్‌ను వరుస వివాదాలు వెంటాడుతున్నాయ్. రామాయణం అన్నారు.. హనుమంతుడికి సీటు అన్నారు.. ఆ తర్వాత సినిమా కథ అసలు రామాయణమే కాదు అన్నారు. అడ్డమైన డైలాగులు.. అర్థం లేని విజువల్స్‌తో రామాయణాన్ని వక్రీకరించి.. హిందువుల నమ్మకాలతో ఆడుకున్నారని.. డైరెక్టర్ ఓం రౌత్‌ మీద జనాలంతా భగ్గుమంటున్నారు.

  • Written By:
  • Publish Date - June 19, 2023 / 03:06 PM IST

స్టోరీ సంగతి సరే.. గ్రాఫిక్స్ అయినా బాగున్నాయా అంటే.. అమీర్‌పేట్‌ గ్రాఫిక్స్ బెటర్ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు చాలామంది. సినిమా మీద తీవ్ర స్థాయిలో ఫైర్ అయిన ఛత్తీస్‌ఘడ్‌ సీఎం.. బ్యాన్ చేసే దిశగా ఆలోచన చేస్తుంటే.. రాముడి సన్నిధి అయిన ఆయోధ్యలోనూ సాధువులు.. ఆదిపురుష్‌ మూవీ మీద తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. సినిమాను నిషేధించాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. ఆదిపురుష్‌ మూవీ మీద అయోధ్య సాధువులు రియాక్ట్ కావడం ఇది రెండోసారి. ట్రైలర్‌ రిలీజ్ అయినప్పుడే.. సినిమా ఏదో తేడాగా ఉందని.. రామాయణాన్ని హిందూ దేవుళ్లను తప్పుగా చూపించారని ఆరోపించారు.

మీసాలు లేకుండా.. గుబురు గడ్డంతో హనుమంతుడి రూపాన్ని చూపించారని.. ఇది కచ్చితంగా హిందూ దేవుళ్లను అవమానించడమే అని సాధువులు ఫైర్ అవుతున్నారు. డైలాగులు దరిద్రంగా ఉన్నాయని.. దేవుళ్లను తక్కువ చేసేలా వినిపించాయని వాళ్లు మండిపడుతున్నారు. రాముడు, హనుమంతుడు, రావణుడు.. ఇలా అన్ని పాత్రలను తప్పుగా చూపించారని.. హిందూ దేవుళ్లను తక్కువ చేసేలా చూపించారని.. హిందూ భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశారని అంటున్నారు. ఆదిపురుష్ బ్యాన్ చేయకపోతే.. అడ్డుకొని తీరుతామని హెచ్చరించారు. ఆదిపురుష్‌ చుట్టూ వివాదాలు రోజురోజుకు పెరుగుతున్నాయ్. అభ్యంతర డైలాగ్‌లు సన్నివేశాలు డిలీట్ చేసి కొత్త ప్రింట్ రిలీజ్ చేస్తామని మూవీ టీమ్ ఇప్పటికే ప్రకటించగా… మరి ఇక్కడితో అయినా ఆగుతుందా లేదో మరి !