డిఫరెంట్ కాన్సెప్ట్‌తో హారర్ త్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమా రిలీజ్ రోజే మంచి టాక్ తెచ్చుకుంది. ఇలాంటి సినిమా వచ్చి చాలా కాలం అవ్వడంతో ఆడియన్స్ థియేటర్స్‌కు క్యూ కట్టారు. వాళ్ల నమ్మకానికి ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉంది. ప్రతీ సీన్‌ను ఫుల్‌గా ఎంజాయ్ చేశారు ఫ్యాన్స్. ఫస్ట్ డే పాజిటివ్ టాక్ రావడంతో సినిమా ఫేట్ మారిపోయింది. సినిమా రిలీజ్‌కు ముందే ప్రమోషన్స్ భారీ స్థాయిలో చేశారు. ఇది సినిమా మీద అంచనాలు పెంచేసింది.
దీనికి తోడు ఇది సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్‌కు ఓ రకంగా రెండో లైఫ్. కొన్ని రోజుల క్రితం బైక్ యాక్సిడెంట్‌కు గురైన సాయిధరమ్ తేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. సీరియస్ పొజిషన్ నుంచి కోలుకుని సేఫ్‌గా బయటికి వచ్చాడు. ఆ గండం తప్పిన తరువాత సాయి ధరమ్ తేజ్ నటించిన మొదటి సినిమా విరూపాక్ష. దీంతో ఈ సినిమా మీద సాయిధరమ్ ఫ్యాన్స్‌తో పాటు మెగా ఫ్యాన్స్ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపించారు. కథ, కథనం, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ విషయంలో డైరెక్టర్ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ప్రతీ విషయాన్ని చాలా క్లియర్‌గా ఇంట్రెస్టింగ్‌గ తెరకెక్కించాడు. ఒకే సస్పెన్స్‌ను లాస్ట్ వరకూ క్యారీ చేసి ఆడియన్స్‌ను త్రిల్ చేశాడు. ఆ పనితనమే 100కోట్ల కలెక్షన్ రూపంలో తిరగి వచ్చింది. ఇప్పటికే ఎంతో మందితో శభాష్ అనిపించించుకున్న విరూపాక్ష సినిమా మే 21 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.