Sai Pallavi: సాయిపల్లవి ఏ సినిమా అయినా నచ్చితే చేస్తుంది. నచ్చితేనే చేస్తుంది. లేదంటే పెద్ద సినిమా, చిన్న సినిమా అని చూడదు. గ్లామర్ కంటే పెర్ఫామెన్స్‌కే స్కోప్ ఉన్న రోల్స్ చేస్తుంది. ఎక్కడా అతి అనిపించే స్కిన్ షో ఉండదు. అందుకే తనంటే ప్యామిలీ ఆడియన్స్‌లో క్రేజ్ మామూలుగా ఉండదు. అంతేకాదు తన వ్యక్తిత్త్వం, ముక్కుసూటితనం.. ఇలా ఇవన్నీ యూత్‌లో క్రేజ్‌ని తెచ్చిపెట్టాయి. స్టార్ ఇమేజ్ సొంతమయ్యేలా చేశాయి.
దీనికి తోడు మంచి నటి అవటం, చేసిన మూవీల్లో ఎక్కువ బ్లాక్ బస్టర్లు ఉండటం, హీరో ఇమేజ్‌నే డామినేట్ చేసేంతగా తన స్క్రీన్ ప్రెజెన్స్ ఉండటం.. ఇవన్నీ కలిపి సాయిపల్లవిని లేడీ పవర్ స్టార్‌గా మార్చాయి. అలా లేడీ పవన్ కళ్యాణ్ అనిపించుకున్న సాయి పల్లవి చేతిలో శివకార్తికేయన్ మూవీ తప్ప మరొకటిలేదు. అది కూడా జస్ట్ ఎనౌన్స్ అయ్యింది. అంతే మరీ సెలెక్టీవ్‌గా వెళ్లటం వల్ల సాయిపల్లవికి క్రేజ్, ఇమేజ్ ఉన్నా సినిమాల జోరు పెరగట్లేదు. అలానే తను కోరినట్టు మ్యాటర్ ఉన్న మూవీలు.. అందులో హీరోయిన్‌కి ప్రాధాన్యం ఉన్న సినిమాలు కావాలంటే.. అలాంటివి పుష్కరానికోసారి తప్ప మాటి మాటికి రావు. దీంతో ట్యాలెంట్ ఉన్నా, ఖాళీగానే మిగిలిపోవాల్సి వస్తోంది.