SAI PALLAVI: సాయిపల్లవి చేసిన సినిమాలు తక్కువే అయినా తనకి లేడీ పవర్ స్టార్ అని, తనే లీడ్ అనేంతగా గుర్తింపు దక్కింది. దీనికి కారణం తనకి నచ్చితే చేస్తుంది.. నచ్చితేనే సినిమాకు కమిటౌతుంది.. ఇదే స్టాండ్ మీద ముందుకెళుతోంది. ఈ పద్ధతితో తను చాలా లాస్ అయ్యిందన్నారు. మంగళవారం నుంచి మహర్షి మూవీ వరకు చాలా ఆఫర్స్ ఇలానే వదులుకుంది. నిజానికి తను సినిమా ఆఫర్లు వదులుకుంది కాని, తన క్యారెక్టర్‌ని పోగొట్టుకోలేదు.
PRABHAS: ప్రభాస్ లేకుండానే మారుతి, కల్కి మూవీలు
ఆ రేర్ క్వాలిటీనే జనాల్లో సాయి పల్లవిని తమ మనిషి అనేంతగా దగ్గర చేసింది. మరో సౌందర్య, మరో సావిత్రి అనేలా తనకి ప్రత్యేక గుర్తింపు దక్కింది. ఇక పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎలాగూ సాయిపల్లవికి సపోర్ట్ చేస్తారు. ఇవన్నీ ఒక ఎత్తైతే, తనకి పాత్ర నచ్చితే విరాట పర్వం లాంటి మూవీ కూడా చేసి ఫెయిల్యూర్స్ ఫేస్ చేయటానికి సిద్దమౌతుంది సాయిపల్లవి. అందుకే క్యారెక్టర్‌తో పాటు కంటెంట్‌ని నమ్ముకున్న తను, చాలా సినిమాలు వదులుకుంది. తక్కువ హిట్లే సొంతం చేసుకున్నా జనాల్లో మాత్రం మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఏకంగా 3 పాన్ ఇండియా మూవీలు చేస్తోంది. ఆల్రెడీ యానిమల్ హీరో రణ్‌బీర్ కపూర్ చేసే రామాయణంలో సీతగా తను కనిపించబోతోంది. ఇంతలో కేజీయఫ్ ఫేం యష్ టాక్సిక్ మూవీ ఎనౌన్స్‌మెంట్ వచ్చింది.
అందులో కూడా హీరోయిన్‌గా సాయిపల్లవే కనిపించబోతోందట. ఇంక నాగచైతన్యతో తను చేస్తున్న తండేల్ మూవీ కూడా పాన్ ఇండియా సినిమానే అని తెలుస్తోంది. ఇవన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలే. కాబట్టే, సాయిపల్లవి లాంటి ట్యాలెంట్ ఉన్న హీరోయిన్లు లేటుగా ఫోకస్ అయినా, లేటెస్ట్‌గా దూసుకెళతారని రుజువైంది. మూడు పాన్ ఇండియా మూవీలతో తనెక్కడికో వెళ్లేలా ఉంది.