Sai Pallavi : రెమ్యునరేషన్ పెంచేసిన సాయిపల్లవి..

నిన్నటి వరకు ఖాళీగా కనిపించిన సాయిపల్లవి ఒకేసారి బిజీ అయిపోయింది. సౌత్‌ ఇండియాలోని అన్న భాషలూ కవర్‌ చేస్తూ.. ఒకేసారి నాలుగు లాంగ్వెజెస్‌ చేస్తోంది. సాయిపల్లవికి రెమ్యునరేషన్‌తో పనిలేదు. డబుల్‌ రెమ్యునరేషన్‌ ఇస్తామన్నా చేయదు. కథ, క్యారెక్టర్‌ నచ్చితేనే సినిమాకు సైన్‌ చేస్తుంది. మొత్తానికి రెండేళ్ల గ్యాప్‌ తర్వాత విన్న కథలన్నీ నచ్చేశాయనుకుంట. ఒకేసారి తెలుగు, తమిళం.. కన్నడం.. మలయాళంలో ఒక్కో సినిమా చేస్తోంది. యదార్థ సంఘటన ఆధారంగా రూపొందుతున్న తండేల్‌ సినిమాలో చైతు భార్యగా సాయిపల్లవి కనిపించనుంది.

విరాటపర్వం తర్వాత తెలుగు సినిమా ఓకె చేయడానికి సాయిపల్లవి దాదాపు రెండేళ్ల సమయం తీసుకుంది. దీనికంటే ముందే.. తమిళ మూవీ ఓకె చేసింది. కమల్‌ హాసన్‌ నిర్మిస్తున్న సినిమాలో శివకార్తికేయ హీరోయిన్‌గా ఎంపికైంది సాయిపల్లవి. హిందీలో రూపొందే రామాయణంలో రాముడిగా రణ్‌బీర్‌ కపూర్.. సీతగా సాయిపల్లవి పేరు వినిపిస్తోంది. ఇప్పటికే సాయిపల్లవిపై మేకప్‌ టెస్ట్ కూడా నిర్వహించి ఫైనల్‌ చేసినా.. అధికారికంగా వెల్లడించాల్సి వుంది. సాయిపల్లవి తమిళ మూవీతో ఎంట్రీ ఇచ్చినా.. మలయాళ సినిమా ప్రేమమ్‌ గుర్తింపు తీసుకొచ్చింది. నాలుగేళ్ల గ్యాప్ తర్వాత మరోసారి మలయాళ చిత్రం ఓకె చేసి ప్రేమమ్‌ తర్వాత మరోసారి నివిన్‌ పౌలీతో జత కడుతోంది.

కెజిఎఫ్‌2 తర్వాత దాదాపు రెండేళ్లు గ్యాప్‌ తీసుకున్న యశ్‌ కొత్త సినిమాను 8న ప్రకటించనున్నాడు. డైరెక్టర్‌ ఎవరో చెప్పకుండానే.. హీరోయిన్‌గా సాయిపల్లవి పేరు బైటకొచ్చింది. ఈ కన్నడ మూవీ కూడా ఓకె అయితే.. సాయిపల్లవి ఒకేసారి నాలుగు లాంగ్వేజెస్‌ కవర్‌ చేసిన హీరోయిన్‌గా అరుదైన ఫీట్‌ అందుకుంటుంది.