Sai Pallavi: సాయి పల్లవిని రిజెక్ట్ చేసిన విజయ్ దేవరకొండ.. కారణమేంటి..?

ఆ మధ్యలో పల్లవి ఇక సినిమాలు మానెస్తుంది.. వైద్య రంగంలో సెటిల్ అయిపోతుందని.. ప్రస్తుతం హాస్పిటల్ నిర్మాణ పనులతో బిజీగా ఉందని ప్రచారం జరిగింది. కానీ తమిళ్‌లో శివ కార్తికేయన్‌ సరసన ఓ సినిమా అనౌన్స్ చేసింది.

  • Written By:
  • Publish Date - March 21, 2024 / 11:45 AM IST

Sai Pallavi: మామూలుగా అయితే.. ఎంత పెద్ద స్టార్ హీరో అయిన సరే, కథ నచ్చకపోతే నిర్మొహమాటంగా రిజెక్ట్ చేస్తుంది సాయి పల్లవి. కానీ ఆమెనే ఓ యంగ్ హీరో రిజెక్ట్ చేశాడనే న్యూస్ ఇప్పుడు వైరల్‌గా మారింది. తెలుగులో ‘విరాట పర్వం’ తర్వాత మరో తెలుగు ప్రాజెక్ట్‌ చేయడానికి చాలా గ్యాప్ తీసుకుంది సాయి పల్లవి.

Chiranjeevi: మెగా రిస్క్.. బురదలో చిరంజీవి.. అందుకే మెగాస్టార్ అయ్యారు!

అయితే ఆ మధ్యలో పల్లవి ఇక సినిమాలు మానెస్తుంది.. వైద్య రంగంలో సెటిల్ అయిపోతుందని.. ప్రస్తుతం హాస్పిటల్ నిర్మాణ పనులతో బిజీగా ఉందని ప్రచారం జరిగింది. కానీ తమిళ్‌లో శివ కార్తికేయన్‌ సరసన ఓ సినిమా అనౌన్స్ చేసింది. కానీ సాయి పల్లవికి సరైన స్క్రిప్ట్ కుదరక పోవడంతో తెలుగు సినిమాలకు ఒప్పుకోవడం లేదని వినిపించింది. ఈ విషయంలో ఆమె అభిమానులు అప్సెట్ అవుతునే ఉన్నారు. ఫైనల్‌గా నాగ చైతన్యతో కలిసి తండేల్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి.. పుకార్లకు చెక్ పెట్టింది అమ్మడు. ‘లవ్ స్టోరీ’ సినిమాలో నటించిన సాయి పల్లవి.. మరోసారి చైతన్యతో రొమాన్స్ చేసేందుకు ఓకె చెప్పింది.

కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టిన చందూ మొండేటి తండేల్‌ను తెరకెక్కిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. సాయి పల్లవిని స్టార్ హీరో విజయ్ దేవర కొండ రిజెక్ట్ చేశాడనే న్యూస్ వైరల్‌గా మారింది. గీతా గోవిందం కాంబినేషన్‌ను రిపీట్ చేస్తూ.. ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ అనే సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమాలో హీరోయిన్‌గా మృణాల ఠాకూర్ నటిస్తోంది. అయితే.. ముందుగా ఈ సినిమాలో సాయిపల్లివిని హీరోయిన్‌గా అనుకున్నారట. కానీ అందుకు నో చెప్పాడట రౌడీ. ఈ సినిమాలో గ్లామర్‌ షోకి స్కోప్ లేకున్నా కూడా.. రొమాన్స్ మాత్రం చేయాల్సి ఉందట. కానీ ఇలాంటి విషయాల్లో సాయి పల్లవి దూరంగా ఉంటుంది. హద్దులు దాటే సీన్స్ చేయనని చెప్పేస్తుంది. అందుకే.. ఆమెను అప్రోచ్ అవడం కంటే.. మరో హీరోయిన్‌ను తీసుకుంటే బెటర్ అని విజయ్ దేవరకొండ చెప్పాడట. అందుకే.. సాయిపల్లివికి బదులుగా మృణాల్ ఠాకూర్‌ను తీసుకున్నట్టుగా టాక్.