Rakibhai : రాకీ భాయ్ తో సాయి పల్లవి రొమాన్స్..

కన్నడ స్టార్‌ హీరో, ‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ యశ్‌ కు జోడీగా సాయిపల్లవి నటించనున్నారనే టాక్‌ శాండిల్‌వుడ్‌లో వినిపిస్తోంది. యశ్‌ హీరోగా కేవీఎన్‌ ప్రోడక్షన్స్‌ ఓ సినిమాను నిర్మించనున్న సంగతి తెలిసిందే.

కన్నడ స్టార్‌ హీరో, ‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ యశ్‌ కు జోడీగా సాయిపల్లవి నటించనున్నారనే టాక్‌ శాండిల్‌వుడ్‌లో వినిపిస్తోంది. యశ్‌ హీరోగా కేవీఎన్‌ ప్రోడక్షన్స్‌ ఓ సినిమాను నిర్మించనున్న సంగతి తెలిసిందే. ‘కేజీఎఫ్‌: చాఫ్టర్‌–1’, ‘కేజీఎఫ్‌: చాఫ్టర్‌–2’ చిత్రాల తర్వాత యశ్‌ చేయనున్న ఈ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. హాలీవుడ్ స్థాయిలో యశ్ పేరు మారుమోగిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యశ్‌ నటిస్తున్న తదుపరి చిత్రానికి మలయాళ దర్శకురాలు గీతూ మోహన్‌ దాస్‌ తెరకెక్కిస్తారని, ఈ చిత్రంలో సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తారనే టాక్‌ ప్రచారంలోకి వచ్చింది. టాక్సిక్ అనే టైటిల్ తో విడుదలైన ఈ మూవీ గ్లిమ్ప్స్, మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. కన్నడ సినీ ఇండస్ట్రీ సత్తా ఏంటో కేజీఎఫ్ సినిమాతో బయటపడింది. దీంతో పాటు హీరో యష్ కూడా ఓవర్ నైట్ సూపర్ స్టార్ గా మారిపోయాడు. ఒకవైపు రాకీ భాయ్, మరోవైపు లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి ఉండడంతో, సినిమా మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఊపందుకుంటున్నాయి.