రావణుడి మంట భైరాతో చల్లారిందా…? సైఫ్ హ్యాపీ…?

ఆదిపురుష్ సినిమా చూసిన వాళ్లకు ఎక్కడా కూడా కళ్ళు ఆర్పకుండా చూడాలనే భావన రాలేదు. సినిమా అయ్యే వరకు కూడా ఉండలేని వాళ్ళు చాలా మంది. ఎన్నో అంచనాలతో వచ్చిన సినిమా రాడ్ కావడంతో జనాల కళ్ళల్లో రక్తం కారింది.

  • Written By:
  • Publish Date - September 23, 2024 / 06:58 PM IST

ఆదిపురుష్ సినిమా చూసిన వాళ్లకు ఎక్కడా కూడా కళ్ళు ఆర్పకుండా చూడాలనే భావన రాలేదు. సినిమా అయ్యే వరకు కూడా ఉండలేని వాళ్ళు చాలా మంది. ఎన్నో అంచనాలతో వచ్చిన సినిమా రాడ్ కావడంతో జనాల కళ్ళల్లో రక్తం కారింది. అసలే ప్రభాస్ కు బాహుబలి తర్వాత ఒక్క సరైన హిట్ కూడా లేదని భావిస్తున్న సమయంలో వచ్చిన ఆదిపురుష్ సినిమా కన్నీళ్లు మిగిల్చింది అనే మాట వాస్తవం. ఇక ఇందులో హీరో పాత్ర ఎంత కామెడీగా ఉందో విలన్ పాత్ర కూడా అంతకు మించి కామెడీగా ఉందనే మాట వాస్తవం.

రావణుడిగా నటించిన సైఫ్ అలీ ఖాన్ ను చాలా కామెడీగా చూపించిన మాట వాస్తవం. ఏదో వీడియో గేమ్ తరహాలో అతని పాత్ర ఉంది గాని సినిమాలో అతనికి ఎక్కడా అనుకున్న విధంగా సీన్స్ లేవు. కాని భైరా విషయంలో మాత్రం సైఫ్ ఫుల్ హ్యాపీగా ఉన్నట్టున్నాడు. ఇప్పటి వరకు బయటకు వచ్చిన అతని సీన్స్ అన్నీ కూడా అతనికి ఏ రేంజ్ లో హైప్ ఇచ్చారనేది స్పష్టంగా చెప్తున్నాయి. సైఫ్ వాస్తవానికి మంచి నటుడు. ఏ పాత్ర అయినా సమర్ధవంతంగా చేయగలిగే సామర్ధ్యం ఉన్న నటుడు. అందుకే కొరటాల అతనికి తగిన విధంగా పాత్ర సిద్దం చేసాడు.

కొరటాల సినిమాల్లో విలన్ కంటే హీరోకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. కాని ఈ సినిమాలో మాత్రం భైరా పాత్రకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చినట్టు గానే కనపడింది. సైఫ్ లుక్ కూడా ఫ్యాన్స్ కి నచ్చింది అనే చెప్పాలి. యాక్షన్ సీన్స్ తో పాటుగా నటనకు స్కోప్ ఉన్న సీన్స్ లో అతనికి ఎక్కువ హైప్ ఇచ్చే ప్రయత్నం చేసాడు కొరటాల. అందుకే సైఫ్ కూడా తన తెలుగు డెబ్యూ దేవర అనే చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఆదిపురుష్ ప్రమోషన్స్ కి హాజరు కాని సైఫ్… దేవర ప్రమోషన్స్ కి మాత్రం హాజరు అవుతున్నాడు. అటు హిందీలో కూడా ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. మరి సినిమాలో భైరా పాత్ర ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.