Saif Ali Khan: దేవరను ఢీకొట్టనున్న భైరా.. సైఫ్ ఇలా ఉన్నాడేంటి భయ్యా..?

విలన్ పాత్రలో ఒకప్పటి బాలీవుడ్ టాప్ హీరో సైఫ్ అలీఖాన్ యాక్ట్ చేస్తున్నాడు. సైఫ్ బర్త్‌డే సందర్భంగా.. మూవీ నుంచి అతని లుక్ రిలీజ్ చేసింది దేవర టీమ్. ఈ మూవీలో.. సైఫ్ అలీఖాన్ భైరా అనే క్రూరమైన విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు.

  • Written By:
  • Publish Date - August 16, 2023 / 05:48 PM IST

Saif Ali Khan: ప్రేక్షకులు ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్న మూవీస్ లిస్ట్‌లో టాప్‌లో ఉంది దేవర. కొరటాల, ఎన్టీఆర్‌ కాంబోలో వస్తున్న సెకండ్‌ మూవీ కావడం.. ట్రిపుల్ ఆర్ తర్వాత తారక్ నుంచి సినిమా రాబోతుండడంతో.. ఆటోమెటిక్‌గా అంచనాలు పెరిగాయి. జాన్వీ కపూర్ హీరోయిన్‌, అనిరుధ్ మ్యూజిక్ అంటేనే అంచనాలు పీక్స్‌కు చేరగా.. ఫస్ట్‌ లుక్‌లో ఎన్టీఆర్‌ లుక్‌ క్రేజీ అనిపించింది. దీనికితోడు హాలీవుడ్‌ టెక్నిషియన్లను కొరటాల రంగంలోకి దింపాడని టాక్ వినిపించడం.. ఫైట్స్‌ ఊహకు మించి ఉంటాయనే గుసగుసలు వినిపించడంతో.. దేవర మీద క్యూరియాసిటీ పెరిగిపోయింది.

ప్యాన్‌ ఇండియా ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేసే కంటెంట్‌తోనే దేవర మూవీ రాబోతోంది. దీనికి అనుగుణంగానే క్యాస్టింగ్‌ కూడా కనిపిస్తోంది. ప్యాన్ ఇండియన్ కలర్‌కు తగ్గట్లుగానే.. మూవీలో విలన్‌తో పాటు హీరోయిన్‌ను కూడా బాలీవుడ్ నుంచే తీసుకున్నారు. విలన్ పాత్రలో ఒకప్పటి బాలీవుడ్ టాప్ హీరో సైఫ్ అలీఖాన్ యాక్ట్ చేస్తున్నాడు. సైఫ్ బర్త్‌డే సందర్భంగా.. మూవీ నుంచి అతని లుక్ రిలీజ్ చేసింది దేవర టీమ్. ఈ మూవీలో.. సైఫ్ అలీఖాన్ భైరా అనే క్రూరమైన విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. అతని లుక్‌తో పాటు.. సముద్రంలో నాటు పడవలపై వెళ్తున్న కొందరు మనుషులు కనిపిస్తున్నారు. సైఫ్ అలీఖాన్ మరీ అంత క్రూరమైన గెటప్‌తో ఏం కనిపించడం లేదు. చూపుల్లో కానీ, డ్రెస్సింగ్‌లో కానీ.. విలన్ అన్నంత కాఠిన్యం లేదు.

ఇంకా చెప్పాలంటే.. పాత మల్లీశ్వరి సినిమాలో ఎన్టీఆర్ గెటప్‌లా ఉంది సైఫ్‌ రూపం. ఈ లుక్‌ ఇప్పుడు అందరినీ సర్‌ప్రైజ్ చేస్తోంది. ఇక అటు దేవర షూటింగ్‌తో పాటు అప్డేట్స్ కూడా వేగంగానే అందిస్తోంది మూవీ టీం. ఏదేమైనా ఎన్టీఆర్ లుక్‌తో కంపేర్ చేసినప్పుడు ఈ ఇద్దరూ సమవుజ్జీలుగా ఉంటారని మాత్రం అనిపిస్తోంది.