Saindhav: చిన్నోడు, పెద్దోడు ఒక రోజు గ్యాప్‌లో వచ్చేస్తున్నారు. చిన్నోడితో పోటీ ఇబ్బందిగా లేదంటే.. పెద్దోడు లైట్ తీసుకున్నాడు. అన్నదమ్ములు ఇలా బాక్సాఫీస్ వద్ద కొట్టుకుంటారనేది ఊహించని ట్విస్ట్. వీళ్లెవరో అర్థమైపోయింది కదూ. సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టులో చిన్నోడు, పెద్దోడుగా మహేశ్, వెంకటేశ్ తెలుగు తెరపై చెరగని ముద్ర వేశారు. అన్నదమ్ములు ఇలా కూడా వుంటారా..? సినిమాలో క్యారెక్టర్స్‌కు పేర్లు లేకుండా.. చిన్నోడు.. పెద్దోడుగానే సినిమా నడిచిపోయింది.
చిన్నోడు నటించిన గుంటూరుకారం జనవరి 12న వస్తుంటే.. పెద్దోడు వెంకటేశ్ అనుకోకుండా సైంధవ్‌తో 13న వస్తున్నాడు. ఈ డిసెంబర్ 23న సైంధవ్ రావాల్సివున్నా.. సలార్ రాకతో వాయిదాపడింది. నాని సొంత బేనర్‌లో హిట్ సిరీస్ తీసిన శైలేశ్ కొలను డైరెక్షన్‌లో ”సైంధవ్’ తెరకెక్కింది. సోమవారం టీజర్ రిలీజ్ చేయగా.. చైల్డ్ సెంటిమెంట్‌తోపాటు ఔట్ అండ్ ఔట్ యాక్షన్‌గా రూపొందింది. సైంధవ్ టీజర్ రిలీజ్ ఈవెంట్‌లో చిన్నోడుతో పోటీ పడాల్సి వస్తోంది కదా అని అడిగితే.. ఇద్దరి సినిమాలూ సూపర్‌హిట్ అవుతాయని వెంకీమామ జోస్యం చెప్పాడు. వెంటేశ్, రానా నటించిన వెబ్ సిరీస్ రానా నాయుడుపై వచ్చిన విమర్శలపై స్పందించిన వెంకీ స్పందించారు.
సిరీస్ ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రేక్షకులకు రీచ్ అయిందని.. హిందీ వెర్షన్‌తో పోలిస్తే తెలుగులో అడల్ట్ కంటెంట్‌ను చాలా వరకూ తగ్గించామని, భవిష్యత్తులో ఇంకా తగ్గిస్తామన్నారేగానీ.. వచ్చిన బ్యాడ్ ఇమేజ్‌ను లైట్‌గా తీసుకున్నాడు వెంకటేశ్. చాలాకాలం తర్వాత ప్రెస్‌మీట్‌కు వచ్చిన వెంకీపై ప్రశ్నల వర్షం కురిసింది. ఇప్పటివరకు నటించిన సినిమాల్లో ఏ సినిమాకు సీక్వెల్ చేయాలనుకుంటున్నారని అడిగితే.. బొబ్బిలిరాజా అయితే బాగుంటుందన్నాడు.