Salaar-2 : స‌లార్-2 మొత్తం మార్చాల్సిందేన‌ట‌

సలార్ (Salaar) తో బాక్సాఫీస్ రికార్డులను తిరగ‌రాశాడు యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్.. సలార్ బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడంతో సలార్ 2 (Salaar 2) పై విపరీతమైన బజ్ నెలకొని ఉంది. స‌లార్-2 ‘'గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’' (Game of Thrones) లా ఊహించని ట్విస్టులతో ఉంటుందని ఇప్పటికే లీకులు వ‌చ్చాయి. సీక్వెల్‌లో యాక్షన్‌, డ్రామా, పాలిటిక్స్‌.. వంటి చాలా ఆంశాలను కనిపిస్తాయని మూవీ టీం ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది.

సలార్ (Salaar) తో బాక్సాఫీస్ రికార్డులను తిరగ‌రాశాడు యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్.. సలార్ బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడంతో సలార్ 2 (Salaar 2) పై విపరీతమైన బజ్ నెలకొని ఉంది. స‌లార్-2 ‘’గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’’ (Game of Thrones) లా ఊహించని ట్విస్టులతో ఉంటుందని ఇప్పటికే లీకులు వ‌చ్చాయి. సీక్వెల్‌లో యాక్షన్‌, డ్రామా, పాలిటిక్స్‌.. వంటి చాలా ఆంశాలను కనిపిస్తాయని మూవీ టీం ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. దీంతో.. స‌లార్ -2 పై ఇప్ప‌టికే భారీగా అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఈ సినిమా సెకండ్ పార్ట్ కోసం ఫ్యాన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. కాగా.. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

మొద‌టి భాగంలోనే స్టోరీ మొత్తం చెప్పేయ‌డంతో పార్ట్ -2 లో ఇక యాక్ష‌న్ మాత్ర‌మే పీక్స్ లో ఉంటుంద‌ని అర్ద‌మైపోయింది. వ‌ర‌ల్డ్ ఆర్మీతో దేవా అనే ఆర్మీ ఎలా పోరాడింది? ఖాన్సార్ సొంతం చేసుకుని వ‌ర‌ద‌రాజ్ మ‌న్నార్ కి అప్ప‌గిస్తాడా? తానే ఖాన్సార్ కి రాజుగా ప్ర‌కటించుకుంటాడా? వంటి అంశాలు రెండవ భాగంలో ఉంటాయ‌ని తేలిపోయింది. అయితే.. మామూలుగా అయితే ఏదైనా సినిమా రెండు భాగాలుగా వస్తే మొదటి భాగానికి తీసిన కొన్ని రఫ్ సీన్స్ సెకండ్ పార్ట్ లో కూడా వాడుతుంటారు.. అయితే సలార్ 2 కి అలా జరిగే ఛాన్స్ లేదని తెలుస్తుంది.. సలార్ 2 కథ కొనసాగింపే అయినా దేవా, వరద రాజ మన్నార్ మధ్య జరిగే యుద్ధాన్ని చూపించాల్సి ఉంటుంది. సలార్ 1 లో ఈ సీన్స్ ని షూట్ చేయలేదు. అంతేకాదు సలార్ 2 కథ డిమాండ్ మేరకు ఇంకొన్ని లొకేషన్స్, సెట్స్ వేయాల్సి ఉంటుందట. అలా చూస్తే సలార్ 2 కి మళ్లీ మొత్తం కొత్త సెటప్ చేస్తారని టాక్.. అంటే.. స‌లార్ -2 కోసం మొత్తం కొత్త‌గా సెట్ వేయాల్సి ఉంటుంద‌ట‌..

సలార్ 2 ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుంది. ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్న విషయాలపై ఇప్పుడప్పుడే క్లారిటీ వచ్చే ఛాన్స్ లేదు.. అయితే.. ప్ర‌భాస్ క్యారెక్ట‌రైజేష‌న్ ఎలా ఉంటుంద‌న్న దానిపై ఇప్ప‌టికే క్లారిటీ వ‌చ్చేసింది. ఫ‌స్ట్ పార్ట్‌లో కేవ‌లం ప్ర‌భాస్ ని చూపించారు త‌ప్ప‌! వార్ జోన్ లోకి యంగ్ రెబ‌ల్ స్టార్ దిగాక ఆ ర‌చ్చ ఎలా ఉంటుందో ఇంకా పూర్తిగా చూపించ‌లేదు. సో.. ప్ర‌భాస్ వార్‌జోన్‌లోకి దిగితే ఎలా ఉంటుంద‌న్న‌ది స‌లార్-2 లో చూడ‌బోతున్నాం. అంటే యాక్ష‌న్ ఏ స్థాయిలో ఉంటుందో ఊహించొచ్చు. కేజీఎఫ్ రెండు బాగాల్ని మించి నెక్స్ట్ లెవ‌ల్ ప్ర‌భాస్ ని చూపించాలి. మ‌రి ఆ రేంజ్ ప్ర‌భాస్ ని కటౌట్‌ని చూడ్డానికి వ‌ర‌ల్డ్ వైడ్ డార్లింగ్ ఫ్యాన్స్ ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు.