SALAAR 2: సలార్ మూవీ వచ్చీ రాగానే రూ.750 కోట్లు రాబట్టింది. ఏప్రిల్‌లో సలార్ 2 సెట్స్ పైకెళ్లబోతోంది. కథ సిద్దం, డైరెక్టర్ సిద్దం. ఇక ప్రభాస్ కూడా డేట్లిచ్చాడు. నిజానికి సలార్ వచ్చినప్పుడు మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అలా వస్తేనే రూ.750 కోట్లొస్తే, ఆ మూవీకి సీక్వెల్ అవటంతో క్రేజ్ వేరే లెవల్లో ఉంటుంది. ఫస్ట్ పార్ట్ రెస్పాన్స్ బట్టి సెకండ్ పార్ట్ కథలో మార్పులు చేస్తారు. కాబట్టి సలార్ 2 కథ కదిలించే చాన్స్ ఎక్కువుంది. అలాచూస్తే ఇక బాక్సాఫీస్‌లో వసూళ్ల పూనకాలేనా..?
Rihanna: రెమ్యునరేషన్‌లో ఖాన్స్‌ను మించేసిన రిహన్నా!
సలార్‌తో పోలిస్తే వండర్స్ చేస్తుందనిపించే మరో సీక్వెల్ యానిమల్ పార్క్. యానిమల్‌కి సీక్వెల్‌గా ప్లాన్ చేస్తున్న ఈ సినిమా 2025 ఏడాది మధ్యలో మొదలౌతుంది. అంటే స్పిరిట్‌ని పూర్తి చేశాకే సందీప్ రెడ్డి వంగ రూ.930 కోట్లు రాబట్టి సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేశాడు. మిక్స్‌డ్ టాక్ వచ్చినా ఈ మూవీ 900 కోట్ల పైనరాబడితే, దీని సీక్వెల్ సినీ సునామీ తెచ్చే అవకాశమే ఎక్కువ. ఇక పఠాన్ మూవీ సీక్వెల్ కూడా వండర్స్ చేసే ఛాన్స్ ఉంది. కంటెంట్ ఏమాత్రం బాగోలేదన్నా కూడా ఈ సినిమా వెయ్యికోట్లు రాబట్టింది. అలాంటి మూవీకి సీక్వెల్ అంటే ఇక అది ఏ రేంజ్‌లో దుమ్ము దులుపుతుందో చెప్పలేం. ఆల్రెడీ పుష్ప 2 ఆన్ ది వే. పుష్ప 1 ప్రమోషన్ లేకుండానే బాక్సాఫీస్ బెండు తీసింది. ఇప్పడు హై ఎక్స్‌పెక్టేషన్స్‌తో వస్తున్న పుష్ప 2 అయితే, మినిమమ్ రూ.1000 నుంచి 1500 కోట్లు రాబడుతుందనేంత క్రేజ్ కనిపిస్తోంది. వార్ సీక్వెల్ వార్ 2 మరీ ఇంతగా అంచనాలను పెంచలేదు.
కానీ ఎన్టీఆర్ విలన్‌గా వస్తున్న మూవీ కాబట్టి ఈసారి బాక్సాఫీస్ బెండు తీసే ఛాన్స్ ఉంది. ఈ పాన్ ఇండియా సీక్వెల్స్ అన్నీంట్లోకి ఏది ఎక్కువ వసూళ్లు రాబడుతుందనే విషయంలో మాత్రం మార్కెట్‌లో కొన్ని అంచనాలున్నాయి. సలార్ 2కి 1400 కోట్లు రాబట్టే సీన్ ఉందనేది ఓ అంచనా. అలానే పఠాన్ 2 ఈజీగా 1200 కోట్లు రాబట్టే ఛాన్స్ ఉంది. హిందీ మీడియా అంచనాల ప్రకారం యానిమల్ పార్క్ రూ.2000 కోట్ల రికార్డ్ ఉన్న దంగల్‌నే మించే ఛాన్స్ ఉంది. పుష్ప 2కి కూడా ఆల్‌మోస్ట్ ఇంతే క్రేజ్ ఉంది. అంతే స్టామినా ఉంది. వార్ 2 కూడా వెయ్యికోట్ల మూవీనే అని అనక తప్పదు.