ANIMAL: యానిమల్‌కు సలార్ దెబ్బ.. వెయ్యికోట్ల డ్రీమ్‌ ఆవిరి..

సలార్, డంకీ సందడి చూస్తుంటే 1000 కోట్ల యానిమల్ కల నెరవేరేలా లేదు. రూ.900 కోట్లు కూడా రీచ్ అవటం కష్టంగానే ఉంది. సలార్ టాక్ ఎబో యావరేజ్‌గా వస్తేనే వసూళ్ల వరద తట్టుకోలేం. అలాంటిది సలార్ హిట్ టాక్ తెచ్చుకుంది.

  • Written By:
  • Publish Date - December 22, 2023 / 08:23 PM IST

ANIMAL: యానిమల్ ఎవరిని మింగేద్దామా అని కాచుకు కూర్చుంది. ప్లాప్ మూవీ అంటూ కామెంట్స్ వచ్చినా కలెక్షన్స్ రూ.800 కోట్లు దాటాయి. వెయ్యికోట్ల వేట కొనసాగుతోందన్నారు. ఈ ప్రాసెస్‌లో సలార్‌ని, డంకీనీ యానిమల్ మింగేస్తుందన్నారు. కాని ఈ యానిమల్‌నే ప్రభాస్, షారుఖ్.. ఇద్దరు కాల్చుకు తినేశారు. మొత్తానికి యానిమల్ మూవీ ఫ్రైడ్ చికెన్ పీస్ పరిస్థితైంది.

Mansoor Ali Khan: మన్సూర్‌ అలీ ఖాన్‌కు కోర్టు మొట్టికాయలు.. లక్షరూపాయల జరిమానా..

హ్యాపీగా వెయ్యికోట్ల మూవీగా యానిమల్ మారబోతోంది.. పండగ చేసుకుందామని సందీప్ రెడ్డి సహా చిత్ర యూనిట్ అంతా కాచుకు కూర్చున్నారు. అయితే సలార్, డంకీ సందడి చూస్తుంటే 1000 కోట్ల యానిమల్ కల నెరవేరేలా లేదు. రూ.900 కోట్లు కూడా రీచ్ అవటం కష్టంగానే ఉంది. సలార్ టాక్ ఎబో యావరేజ్‌గా వస్తేనే వసూళ్ల వరద తట్టుకోలేం. అలాంటిది సలార్ హిట్ టాక్ తెచ్చుకుంది. డంకీ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. సో.. ఈ రెండు కూడా 90 శాతం సౌత్, నార్త్ థియేటర్స్‌ని కబ్జా చేశాయి.

కాబట్టి కనీసం 20, 30 రోజుల వరకు ఇదే పరిస్థితి కొనసాగొచ్చు. అలా చూస్తే యానిమల్‌కి వసూళ్ల వరద ఆగినట్టే. ఆనకట్ట పడినట్టే. కాబట్టి.. ఎంత వసూళ్లు వచ్చినా యానిమల్ రూ.900 కోట్ల క్లబ్‌లో చేరటమే కష్టం. ఇక వెయ్యికోట్ల కల కలగానే మిగిలేలా ఉంది.