ANIMAL: సలార్, డంకీ మూవీలను మింగేసేలా ఉన్న యానిమల్

యానిమల్ మూవీ రూ.800 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టింది. అసలు యానిమల్ మూవీకి, సలార్‌కి మధ్య 21 రోజుల టైం ఉంది. కాబట్టి.. ఆలోపు యానిమల్ సందడి తగ్గి సలార్, డంకీ జోరు పెరుగుతుందనుకున్నారు. కానీ, సీన్ అంతా రివర్స్ అవుతోంది.

  • Written By:
  • Publish Date - December 14, 2023 / 08:28 PM IST

ANIMAL: ప్రభాస్ మూవీ సలార్ ఈనెల 22న వస్తోందంటే, దాని ముందురోజు విడుదలయ్యే డంకీకి మూడిందన్నారు. సలార్ సినిమా డంకీని మింగేస్తుందన్నారు. పటాన్, జవాన్ హిట్లున్నా.. ప్రభాస్ సలార్ ముందు షారుఖ్ మూడో మూవీ డంకీ నిలువలేదన్నారు. కాని అవేవీ ఇంకా రిలీజ్ కానేలేదు. ఇంతలోనే ఈ రెండీంటినీ యానిమల్ మింగేసేలా ఉంది అంటున్నారు. ఇది నిజం. యానిమల్ మూవీ రూ.800 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టింది.

MAHESH BABU: మహేశ్ బాబు మీద ట్రోలింగా..? కారణం ఎవరు..?

అసలు యానిమల్ మూవీకి, సలార్‌కి మధ్య 21 రోజుల టైం ఉంది. కాబట్టి.. ఆలోపు యానిమల్ సందడి తగ్గి సలార్, డంకీ జోరు పెరుగుతుందనుకున్నారు. కానీ, సీన్ అంతా రివర్స్ అవుతోంది. యానిమల్ రూ.800 కోట్లు దాటి వెయ్యికోట్ల వైపు పరుగులు తీస్తోంది. అంతేకాదు సలార్ టాక్ వీకైంది. ట్రైలర్ నిరాశపరిచింది. పాట జస్ట్ యావరేజ్. అందులోనూ ప్రభాస్ లుక్ షాకింగ్‌గా ఉంది. ఇక డంకీ ట్రైలర్ చూసిన జనం ఔట్‌డేటెడ్ మూవీ అంటున్నారు. ఈ సినిమాలు రిలీజ్ అయ్యాక కూడా పరిస్తితి ఇలానే ఉంటే.. అంతా యానిమల్‌కి షిప్ట్ అయ్యేలా ఉన్నారు.

ఎంత యానిమల్ మూవీ టాక్ వీకైనా.. యూత్‌కి బాగా నచ్చింది. కాబట్టి.. సలార్, డంకీ ఏమాత్రం టాక్ బాగోలేకపోయినా.. వెంటనే థియేటర్స్‌లో యానిమల్ జోరు పెరిగి, మరిన్ని థియేటర్స్ ఈ సినిమాకే వెళ్లే ఛాన్స్ ఉంది. మరో నెలకుపైనే యానిమల్ సందడి కంటిన్యూ అయ్యేలా ఉంది.