SALAAR: వన్స్ రెబల్ స్టార్ సీన్‌లోకి వస్తే మామూలు ఫైట్ సీన్ కూడా వార్ సీన్‌గా మారిపోతుంది. ఆరేంజ్ కటౌట్‌కి మరో రాజమౌళి అనిపించుకున్న ప్రశాంత్ నీల్ నెరేషన్ తోడైతే బాక్సాపీస్‌లో పరేషానే. ఇప్పుడు అదే జరిగింది. మొన్నటి వరకు డంకీ మూవీ ఎక్కడ సలార్‌కి పోటీ అవుతుందో అన్నారు. ఎంతైనా పటాన్, జవాన్‌తో రెండుసార్లు రూ.1000 కోట్లు రాబట్టిన బాలీవుడ్ బాద్ షా మూవీ కాబట్టి డంకీ చాలా వరకు సలార్‌కి పంచ్ ఇస్తుందన్నారు.
Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్‌కు బెయిల్ మంజూరు.. షరతులివే..
ఇక ఆక్వామ్యాన్ 2 కూడా హాలీవుడ్ నుంచి రావటంతో సలార్ ఓపెనింగ్స్‌కే కాదు ఓవరాల్ బిజినెస్‌కి కూడా గండి కొడతాయన్నారు. కానీ, ఏమైంది.. డంకీ, ఆక్వామ్యాన్ 2 రెండూ కూడా తోక ముడిచాయి. షారుక్‌తో రాజ్ కుమార్ హీరాణీ లాంటి దర్శకుడు తోడయ్యాడంటే డంకీ మరో త్రీ ఇడియట్స్.. మరో పీకే అయ్యే ఛాన్స్ ఉందన్నారు. కాని కథ నిరాశపరచటంతో ప్రేక్షకులు తిరస్కరించారు.ఇదే సమయంలో సలార్ హిట్ టాక్ తెచ్చుకుంది. దీంతో సలార్ జోరుకి డంకీ డల్ అయిపోవాల్సి వస్తోంది. ఇక హాలీవుడ్ మూవీ ఆక్వామ్యాన్ 2 అయితే డంకీతోనే పోటీ పడే పరిస్థితి లేదు. ఇక సలార్‌తో పోటీలో ఏం నిలుస్తుంది.
మొత్తానికి సలార్ ఓపెనింగ్స్‌ని డంకీ ఎఫెక్ట్ చేసింది. పీవీఆర్ ఐనాక్స్‌లో సలార్ కాకుండా డంకీ మాత్రమే విడుదలయ్యేలా ప్లాన్ చేయటం, అలా చాలా స్క్రీన్లు కబ్జా చేయటంతో సలార్‌కి నార్త్‌లో ఎక్కువ థియేటర్లు దొరకలేదట. కాని డంకీ టాక్ వీకవటంతో, ఇప్పడు చాలా స్క్రీన్స్‌లో డంకీ ప్లేస్‌లో సలార్ వేస్తున్నారట. రెండో రోజుకే ఇలాసీన్ మారిపోయింది.