Salaar: సలార్ మూవీ ఈనెల 28కి అన్నారు. ఇప్పుడు డిసెంబర్ 22 అంటున్నారు. ఈ వాయిదాకి గ్రాఫిక్స్ వర్క్ నచ్చకపోవటమే రీజన్ అన్నారు. కాని అసలు సంగతేంటో ఆలస్యంగా బయటికొచ్చింది. సలార్ క్లైమాక్స్ ఫైట్ సీన్ ప్రశాంత్ నీల్‌కి నచ్చలేదట. తను ఊహించిన విధంగా లేకపోవటానికి ఒకటి మేకింగ్‌లో చిన్న లోపాలు, గ్రాఫిక్స్‌తోపాటు కలర్ గ్రేడింగ్ లోపాలే కారణమని తెలుస్తోంది. దీంతో మళ్లీ క్లైమాక్స్ సీన్లకు రీషూట్ చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. దీనికి ప్రభాస్ అవసరం లేదట.
తను లేకుండానే ఎక్కడెక్కడ లోపంగా కనిపిస్తున్న షాట్స్ ఉన్నాయో వాటిని రీషూట్ చేస్తున్నాడు. 9 రోజుల ఈ షెడ్యూల్‌లో ప్యాచ్ వర్క్ పూర్తి చేయబోతున్నాడు. ఇక విజువల్ ఎఫెక్ట్స్ పని చేస్తున్న టీంకి 500ల గ్రాఫిక్ షాట్స్ క్వాలిటీ పెంచటమే కాదు, మొత్తం మార్చమని తేల్చాడట. ప్యాచ్ వర్క్ షూటింగ్ అక్టోబర్ 10లోగా పూర్తవుతుంది. ఇక గ్రాఫిక్స్ రిపేర్లు నవంబర్ ఎండ్‌లోగా పూర్తవుతాయట. కాబట్టి, క్రిస్మస్‌లోగా ఈ మూవీ విడుదలకు సిద్దం అవుతుందన్న ప్రాథమిక అంచనాలతో డిసెంబర్ 22కి రిలీజ్ ప్లాన్ చేశారు. మొత్తానికి సలార్ రిలీజ్ వాయిదాకు అసలైన కారణాలు ఇప్పుడు తేలాయి. ఆ రూమర్లే నిజమయ్యాయి.